Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వాస్తు ప్రకారం ఇంటికి 2 ప్రధాన ద్వారాలు ఉండొచ్చా?

వాస్తు ప్రకారం అని కాకుండా చాలామంది స్థలం ఉందికదా, ఇల్లు కట్టాం అని రెండు ప్రధాన ద్వారాలు కడతారు. వాస్తు ప్రకారం అలా ఉండొచ్చా? లేదా? అనే సందేహం తర్వాత కలుగుతుంది. అయితే రెండు సింహద్వారాలనేవి దిక్కులను బట్టి ఉంటాయి. అవి ఏ దిశలో ఉన్నాయి, వాటి మధ్య ఎలాంటి సమన్వయం ఉంది, నియమాలేంటి, వాటివల్ల కలిగే లాభనష్టాలేంటి? అనే వివరాలను తెలుసుకుందాం.

సాధారణంగా తూర్పు - పడమర లేదా ఉత్తరం - దక్షిణం ద్వారాలు ఉండటం మంచిది.
ఒక ద్వారం ముందు వైపు ఉంటే, మరొకటి దానికి సరిగ్గా వెనుక వైపు ఉండాలి.
అయితే అది నైరుతి మూల ఉండకూడదు.
రెండు ద్వారాలు కూడా ఆయా దిశలలోని శుభప్రదమైన స్థానాల్లో ఉండాలి.
ఉదాహరణకు చెప్పాలంటే.. తూర్పున ఒకటి, ఉత్తరాన ఒకటి ఉండటం అత్యంత శుభప్రదం.

Vastu Shastra According to the principles Is it advisable to have two main doors in a house

రెండు ద్వారాలు ఉండటం వల్ల ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి.
ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది.
అతిథుల కోసం ఒకటి, ఇంటి సభ్యుల వ్యక్తిగత అవసరాల కోసం
మరొకటి ఉపయోగించుకోవడం వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది.
ఉత్తరం, తూర్పు దిశల్లో రెండు ద్వారాలు ఉంటే,
ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉండి ఆర్థికంగా నిలకడగా ఉంటారని వాస్తు చెబుతోంది.

రెండు ద్వారాలు ఒకదానికొకటి ఎదురుగా లేకపోయినా
తప్పుడు దిశల్లో ఉంటే ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు వస్తాయి.
వాస్తు ప్రకారం శక్తి ఒక ద్వారం గుండా వచ్చి ఇల్లంతా ప్రవహించాలి.
రెండు ద్వారాలు సరిగ్గా ఎదురెదురుగా ఉంటే, వచ్చిన శక్తి వచ్చినట్లే బయటకు పోతుంది.
దీనివల్ల కుటుంబంలో డబ్బు నిల్వ ఉండదు.

భద్రత పరంగా రెండు ద్వారాలు ఉండటం కొంత రిస్కు.
రెండు ద్వారాలు సమాన పరిమాణంలో ఉండకూడదు.
ముఖ్య సింహద్వారం ఎప్పుడూ రెండో ద్వారం కంటే పెద్దదిగా, అందంగా, ఎత్తుగా ఉండాలి.
ఇంటికి సరిగ్గా మధ్యలో ద్వారం ఉండకూడదు. కొంచెం పక్కకు ఉండాలి.
ఇంటి మూలల్లో తలుపులు పెట్టకూడదు.
ఇలా పెడితే వంశ వృద్ధి ఆగిపోతుంది.
పొరపాటున కూడా రెండో ద్వారం నైరుతి మూలలో ఉండకూడదు.
భారీ ఆర్థిక నష్టాలకు, ప్రమాదాలకు కారణమవుతుంది.
ఒకవేళ మీ ఇంట్లో రెండో ద్వారం వాస్తు ప్రకారం లేకపోతే,
ఆ తలుపును ఎప్పుడూ తెరిచి ఉంచకుండా, కేవలం అవసరానికి మాత్రమే వాడాలి.
పైన ఒక 'మంగళ తోరణం' లేదా 'దిష్టి వినాయకుడి' పటం ఉంచాలి.
దీనివల్ల దోష నివారణ జరుగుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+