వాస్తు శాస్త్రం ప్రకారం గుర్రం,‘7’ సంఖ్య వెనుక ఉన్న రహస్యం ఏంటి?
ఇంట్లో సానుకూల శక్తిని పెంచి, ఆర్థికాభివృద్ధిని, విజయాలను సొంతం చేసుకోవడానికి వాస్తు శాస్త్రంలో ఎన్నో అద్భుతమైన మార్గాలున్నాయి. అందులో అత్యంత శక్తివంతమైనదిగా భావించేది "పరుగులు తీస్తున్న ఏడు గుర్రాల చిత్రం". ఈ ఫోటోను ఇంట్లో ఉంచడం వల్ల అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తాయని చాలామంది నమ్ముతారు. అయితే, ఈ చిత్రం నుండి పూర్తి స్థాయి శుభఫలితాలు పొందాలంటే దానిని సరైన దిశలో, సరైన నియమాలతో అమర్చడం ఎంతో ముఖ్యం.
గుర్రం,'7' సంఖ్య వెనుక ఉన్న రహస్యం
హిందూ సంప్రదాయంలో గుర్రాన్ని వేగం, ధైర్యం, శక్తి, విజయం, నమ్మకానికి ప్రతీకగా భావిస్తారు.
అలాగే 7 సంఖ్యకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది.
సప్తర్షులు, వారానికి ఏడు రోజులు, సప్తపది, ఇంద్రధనస్సులోని ఏడు రంగులు..
ఇలా ఎన్నో విషయాలు ఈ సంఖ్యతో ముడిపడి ఉన్నాయి.
అందుకే, ఏడు గుర్రాలు పరుగెత్తుతున్న చిత్రం జీవితంలో
నిరంతర ప్రగతిని, కష్టపడే తత్వాన్ని సూచిస్తూ, విజయానికి మార్గం సుగమం చేస్తుంది.

ఏ దిశలో ఉంచితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి?
సమాజంలో గౌరవం పెరగాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలన్నా
ఈ ఫోటోను ఇంటి తూర్పు గోడపై ఉంచాలి.
సూర్యుడు ఉదయించే ఈ దిశ కొత్త అవకాశాలకు, ఎదుగుదలకు తోడ్పడుతుంది.
వ్యాపారంలో లాభాలు, ఆర్థిక స్థిరత్వం కోరుకునే వారు
ఈ చిత్రాన్ని దక్షిణ గోడపై ఏర్పాటు చేయవచ్చు.
అయితే, ఆ గుర్రాల ముఖాలు ఉత్తర దిశ వైపు చూస్తున్నట్లు ఉండాలి.
ఉత్తరం కుబేరుడి స్థానం కాబట్టి, ఇది ధన ప్రవాహాన్ని పెంచుతుంది.
ఆఫీసు లేదా పని స్థలంలో పాటించాల్సిన నియమాలు
గుర్రాల ముఖాలు ఎప్పుడూ కార్యాలయం లోపలికి పరుగెడుతున్నట్లుగా ఉండాలి కానీ,
బయటకు వెళ్తున్నట్లు ఉండకూడదు. లోపలికి చూస్తున్నట్లు ఉంటే
సంపద, అవకాశాలు ఇంటికి లేదా ఆఫీసుకు వస్తాయని,
బయటకు ఉంటే అవి దూరమవుతాయని వాస్తు హెచ్చరిస్తోంది.
అలాగే గుర్రాలు డల్‌గా కాకుండా, ఎంతో ఉత్సాహంగా,
వేగంగా పరుగెడుతున్నట్లు ఉండే చిత్రాలనే ఎంపిక చేసుకోవాలి.
పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి!
పడమర గోడలపై ఈ ఫోటోను ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య
మనస్పర్ధలు, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
ఈ చిత్రాన్ని పడకగది లో ఉంచకూడదు.
గుర్రాల వేగం బెడ్‌రూమ్‌లోని ప్రశాంతతను దెబ్బతీసి,
నిద్రలేమి సమస్యలకు, దాంపత్య జీవితంలో ఆందోళనలకు కారణం కావచ్చు.
ఫొటో ఫ్రేమ్ విరిగిపోయినా లేదా చిత్రం మసకబారినా దానిని వెంటనే తొలగించాలి.












Click it and Unblock the Notifications