స్థలానికి మూలలు పెరిగితే వాస్తు ప్రకారం ఏం చేయాలనేది తెలుసుకోండి
ఇల్లు కట్టుకోవడానికే కాదు.. కొనే స్థలానికి కూడా కచ్చితంగా వాస్తు చూడాల్సిందే. అది సరిగా ఉంటేనే ఇంటి నిర్మాణం కూడా వాస్తు ప్రకారం సరిగా వస్తుంది. లేదంటే ఇబ్బతందులే. అలాగే కొన్ని స్థలాలకు మూలలు పెరుగుతాయి. మరికొన్ని స్థలాలకు రెండువైపులా రోడ్లు ఉంటాయి. అటువంటి స్థలాలు కొనాలా? వద్దా? అనే సందేహంలో చాలామంది ఉంటారు. అయితే ఈ తరహా స్థలాలు అమ్మకానికి వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిగురించి తెలుసుకుందాం.
స్థలానికి మూలలు పెరగడం మంచిది కాదు.
ఆగ్నేయ మూలలో స్థలం పెరిగితే సంతోషమే ఉండదు.
అన్నీ బాధలే ఎదురవుతుంటాయి.
ఒకవేళ కొంటే పరిష్కారం చూసుకోవాలి. కొనకపోతే వదిలేయడం మంచిది.
ఆగ్నేయంలో స్థలం పెరిగితే మహిళలకు మంచిది కాదు.
వారికి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

అయితే కొనుగోలు చేసినవారు పరిష్కారం ఏమిటని నిపుణులను అడుగుతుంటారు.
ఈశాన్యం కాకుండా వేరే మూలలో పెరిగితే ఆ స్థలంలో మట్టి వేసి మొక్కను నాటాలి.
ఏ మొక్కైనా పర్వాలేదు. దాన్ని చక్కగా సంరక్షించాలి.
ఈశాన్యం మినహా ఇతర మూలలు పెరిగిన స్థలాల్లో ఇల్లు కట్టకుండా ఉండటమే మంచిది.
ఇల్లు ఎప్పుడు చతురస్రం, దీర్ఘచతురస్రాకారంలోనే ఉండాలి.
స్థలానికైనా, ఇంటికైనా రెండు రోడ్లు ఉంటే శుభమే జరుగుతుంది.
అయితే మూడు రోడ్లు ఉంటే మాత్రం 100కు 90 మందికి కలిసిరాదు.
తూర్పు, ఉత్తర దిక్కుల్లో రోడ్లు ఉంటే చాలా మంచిది.
అదే దక్షిణం, తూర్పు వైపు రోడ్లు ఉంటే మాత్రం వాస్తు దోషాలు వస్తాయి.
స్థలం ఆగ్నేయం పెరిగితే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. కోర్టు కేసులు, అగ్ని భయం కూడా ఉంటాయి.
నైరుతి పెరిగితే మానసిక ఆందోళనలతోపాటు ఆకస్మిక ప్రమాదాలు జరుగుతాయి.
వాయువ్యం పెరిగితే రాజకీయపరంగా చిక్కులు, స్థిరత్వం లేకపోవడం జరుగుతుంటుంది.
స్థలం నచ్చితే పెరిగిన స్థలాన్ని వదిలేయాలి.
చతురస్రాకారంగా, దీర్ఘచతురస్రాకారంలోకి మర్చాలి.
పెరిగిన భాగాన్ని వేరుచేయాలంటే గోడ కట్టాలి.
మిగిలిన ప్రదేశంలో మొక్కలు పెంచుకోవచ్చు.












Click it and Unblock the Notifications