Vastu vs Valentines gifts: ప్రేమికులు ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవాలి..వాస్తు ఏం చెబుతోంది..?
ప్రేమికుల రోజు ఫలానా గిఫ్ట్స్ ఇస్తే సంబంధాలు మెరుగ్గా ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది
హైదరాబాద్: ఫిబ్రవరి నెల అంటే ప్రేమికులకు చాలా ఇష్టమైన నెల. వన్ సైడ్ లవ్‌లో ఉన్నవారు ఫిబ్రవరి నెల కోసం ఎంతో ఎదురు చూస్తారు. ఎందుకంటే ఈ నెలలో వచ్చే వాలెంటైన్స్ డే అంటే వీరికి చాలా ప్రత్యేకం. ఏది ఏమైనా సరే వారి ప్రేమను ఎదుటి వ్యక్తికి వ్యక్త పరచాలనే దృఢమైన ఆలోచనతో ఉంటారు. అందుకు వాలెంటైన్స్‌డే మంచి రోజుగా భావిస్తారు. ఇంతకంటే మంచి ముహూర్తం మరొకటి ఉండదని కూడా వారు గట్టిగా నమ్ముతారు. అయితే ఇలాంటి వాటిని బలంగా నమ్మేవారు వాస్తు శాస్త్రంను కూడా పరిగణలోకి తీసుకుంటే వారి లవ్ సక్సెస్ అవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ రోజున ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తే అమ్మాయిలు ఇంప్రెస్ అవుతారనేది అబ్బాయిలు తెలుసుకోవాలి. ఇక ఆల్రెడీ లవ్‌లో ఉన్న అబ్బాయిలూ అమ్మాయిలూ ఒకరికొకరిపై ఎంత ప్రేమ ఉందో తెలిపేందుకు మంచి గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకుంటారు. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఎలాంటి గిఫ్ట్స్ లేదా కానుకలు ఇస్తే ప్రేమికుల బంధం బలంగా ఉంటుందో తెలుసుకుందాం.

వెదురుతో ఎదురుండదు
వాస్తు శాస్త్రంలో వెదురు మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ మొక్కను ఎక్కువగా హోటల్స్‌లో ఉంచుతారు.ఈ మొక్క ఉంచడం వల్ల వ్యాపారంలో మంచి వృద్ధి లాభాలు వస్తాయని నమ్ముతారు. అంటే ఈ మొక్కను శ్రేయస్కరంగా భావిస్తారు. ప్రేమికుల రోజున మీ భాగస్వామికిక వెదురు మొక్కను బహుమతిగా ఇస్తే మీ ప్రేమ బలోపేతం కావడమే కాకుండా సంతోషం, శాంతి మీ మధ్య నెలకొంటుంది.

లాఫింగ్ బుద్ధ:
లాఫింగ్ బుద్ధ.. దీని గురించి తెలియని వారుండరు. లాఫింగ్ బుద్ద మనకు చాలా చోట్ల కనిపిస్తుంది. ఇళ్లలో, ఆఫీసుల్లో ఇతర చాలా ప్రదేశాల్లో కనిపిస్తుంది. లాఫింగ్ బుద్ధను ఉంచితే అక్కడ సంతోషం వెల్లి విరుస్తుందని చెబుతారు. అంతేకాదు దీనికి పవిత్రత చాలా ఉంది. ప్రేమకు కూడా చాలా పవిత్రత ఉందని సూచిస్తారు కాబట్టి లాఫింగ్ బుద్ధను ప్రేమికులు బహుమతిగా ఇచ్చిపుచ్చుకోవచ్చు. ఈ విగ్రహం మీ భాగస్వామి జీవితంలో ఆనందం, శ్రేయస్సు, మరియు పాజిటివిటీని పెంపొందిస్తుంది.

రంగు రంగుల పువ్వులు
వాలెంటైన్స్ డే అంటేనే ప్రేమికులకు ముందుగా గొర్తొచ్చేది పూలు. ప్రేమికుల రోజున రెడ్ రోజెస్‌కు భలే గిరాకీ ఉంటుంది. ఆరోజున ఎర్ర గులాబీల ధర కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. కానీ ఇవేమీ ప్రేమికులకు కనపడవు. ఎందుకంటే వారు అంతలా ప్రేమలో మునిగిపోయి ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రేమికుల రోజున ఎర్ర గులాబీ పువ్వులు ఇవ్వడంశ్రేయస్కరం. రెడ్ రోజెస్ మరియు రెడ్ కలర్ పూలు స్నేహంను బలోపేతం చేయడమే కాకుండా ఇద్దరి మధ్య ప్రేమను కూడా మరింతగా పెంచుతుందని నమ్ముతారు. ఇక గులాబీ పువ్వులు ఇచ్చేప్పుడు ముళ్లు ఉండకూదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముళ్లున్న రోజా పూలు ఇవ్వడం వల్ల సంబంధాలు తెగిపోయే అవకాశాలున్నట్లు వాస్తు శాస్త్రం చెబుతోంది.

గిఫ్ట్‌ను ప్యాక్ చేసే గిఫ్ట్ కవర్ ఎలా ఉండాలి..
వాలెంటైన్స్ డే రోజున కేవలం గిఫ్ట్ ఇస్తే సరిపోదండోయ్. గిఫ్ట్‌ను ప్యాక్ చేసే కవర్ కూడా చాలా ఫోకస్ చేయాలి. గిఫ్ట్ కవర్ కలర్ కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.మీరు గిఫ్ట్‌ను ప్యాక్ చేసేందుకు వినియోగించే కవర్ కలర్ మీ రిలేషన్‌షిప్ పై ఎఫెక్ట్ చూపుతుందట. ముఖ్యంగా బ్లూ కలర్, బ్లాక్ కలర్, వైట్ కలర్ లేకుండా ఉండే గిఫ్ట్ కవర్‌ను ఎంచుకోవాలి. గోల్డ్ కలర్, రెడ్ కలర్, పసుపు కలర్ ఉండే కవర్‌తో గిఫ్ట్‌ను ప్యాక్ చేసి మీ భాగస్వామికి ఇస్తే పాజిటివిటీ ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు












Click it and Unblock the Notifications