vastu tips: కుటుంబ సభ్యుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం కావాలంటే ఇంట్లో ఈ మార్పులు చేసి చూడండి
మన ఇంటికి సంబంధించి ప్రతి ఒక్కటీ వాస్తు ప్రకారం ఉంటే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని, దానిద్వారా మనుషుల్లో సానుకూల శక్తి ప్రసరిస్తుందని వాస్తు నిపుణులు చెబుతుంటారు. అయితే కొన్ని కొన్నింటివల్ల ప్రతికూల ప్రభావం కలుగుతుందని, అందుకు కారణమేంటని గుర్తించి సరిదిద్దుకుంటే చాలని వివరిస్తున్నారు.

అనవసరమైన వస్తువులు ఇంట్లో ఉండకూడదు
వాస్తు శాస్త్రం ప్రకారం పాత వస్తువులు, చిరిగిపోయిన దుస్తులు, అనవసరమైన వస్తువులు ఇంట్లో ప్రతికూల వాతావరణాన్ని కలగజేస్తాయి. పాడైన వస్తువులను పారవేయడం లేదంటే బాగుచేయించుకోవడం చేస్తుండాలి. ఇంటికి చేయించుకునే ఇంటీరియర్ డెకరేషన్ వాస్తు దోషాలను తొలగిస్తుంది.

ఈశాన్యంలో పూజాస్థలం ఉండాలి
ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలన్నా, కుటుంబ సభ్యులమధ్య ఆప్యాయాతానురాగాలు వెల్లివిరియాలన్నాకొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం. ఇల్లు సర్వతో ముఖాభివృద్ధికి, మనఃశాంతికి పూజాస్థలం ఈశాన్యంలోనే ఉండాలి. ఎందుకంటే ఈశాన్యం దేవతల స్థలం. పూజాస్థలం పైనకానీ, కిందకానీ టయిలెట్, వంటగది, మెట్లు ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమైంది. ఇటువంటి చిన్న చిన్న విషయాలను సరిచేసుకుంటే వాస్తుదోషాలు తొలగిపోతాయి.

ఎండిపోయిన మొక్కలు ఉండకూడదు
అలాగే ఇంటి లోపల ఉండే దుమ్ము, ధూళిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. దీనివల్ల ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉండదు. అలాగే ఇంట్లో మొక్కలు నాటితే ఎప్పటికప్పుడు వాటికి నీరు పోస్తూ ఉండాలి. ఒకవేళ ఏదైనా మొక్క ఎండిపోతే వెంటనే దాన్ని తొలగించాలి. మన ఇంటి తలుపు తెరిచేటప్పుడుకానీ, మూసేటప్పుడుకానీ శబ్దం వస్తుంటే వెంటనే దాన్ని సరిదిద్దాలి. ద్వారం నుంచి వచ్చే శబ్దం ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది.

దక్షిణం వైపు పాదాలు పెట్టి నిద్రపోకూడదు
దక్షిణం వైపు పాదాలు పెట్టి నిద్రించకూడదు. అది మంచిది కాదు. బెడ్ రూమ్‌లో కూడా ప్రధాన ద్వారంవైపు పాదాలు పెట్టి నిద్రించకూడదు. తూర్పు దిశలో తల పెట్టి, పశ్చిమ దిశలో పాదాలు ఉంచి నిద్రపోవడంవల్ల మనుషుల్లో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముళ్ల పొదలు ఉన్న మొక్కలను ఇంట్లో నాటకూడదు. వాస్తు ప్రకారం ఈ తరహా మొక్కలు ప్రతికూల వాతావరణానికి కారణమవుతాయి.












Click it and Unblock the Notifications