vastu tips: వాస్తు ప్రకారం హాల్‌లో టీవీ, సోఫా ఈ దిక్కుల్లో పెట్టి అదృష్టవంతులవ్వండి!

ఇంటికి హృదయం లాంటిది లివింగ్ రూమ్. కుటుంబ సభ్యులందరూ సరదాగా గడిపేది, ఇంటికి వచ్చే అతిథులను ఆప్యాయంగా ఆహ్వానించేది ఇక్కడే. వాస్తు శాస్త్రం ప్రకారం లివింగ్ రూమ్‌లోని దిశలు, ఫర్నిచర్ అమరిక, ఎలక్ట్రానిక్ వస్తువుల స్థానాలు ఇంటి వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా సోఫా, టీవీలను సరైన దిశలో ఉంచడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణం, ప్రశాంతత, ఆర్థిక సౌఖ్యం కొనసాగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

అందరినీ ఆకర్షించేది సోఫా

హాలులో అందరినీ ఆకర్షించే ప్రధాన ఫర్నిచర్ సోఫా. దీనిని అమర్చేటప్పుడు బరువు, దిశలను పరిగణనలోకి తీసుకోవాలి. బరువైన, ఎంబ్రాయిడరీ లేదా భారీ డిజైన్ ఉన్న సోఫాలను దక్షిణం లేదా నైరుతి గోడలకు ఆనించి ఉంచడం శ్రేయస్కరం. వాస్తు ప్రకారం ఇంటికి నైరుతి భాగం బరువుగా ఉండటం స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇక సింపుల్ మోడల్స్, తేలికగా ఉండే సోఫాలను తూర్పు లేదా ఉత్తరం దిశల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. సోఫాలో కూర్చున్నప్పుడు వారి ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా చూసుకుంటే సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. అలాగే సోఫా పూర్తిగా నేలకు అతుక్కుపోకుండా కింద కొంత ఖాళీ ఉంటే గాలి ప్రసరణతో పాటు 'ప్రాణ శక్తి' సజావుగా ప్రవహిస్తుంది.

వాస్తు ప్రకారం.. ఇంట్లో మూడు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ వాడవచ్చా?
వాస్తు ప్రకారం.. ఇంట్లో మూడు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ వాడవచ్చా?
Vastu tips According to Principles place the TV and sofa in these directions in the hall and invite good fortune

అగ్ని తత్వానికి సంకేతం టీవీ

వాస్తు శాస్త్రంలో టీవీ, కంప్యూటర్లు, సౌండ్ సిస్టమ్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అగ్ని తత్వానికి సంకేతంగా భావిస్తారు. అందువల్ల అగ్ని మూల అయిన ఆగ్నేయ దిశలో టీవీని అమర్చడం అత్యంత అనుకూలం. ఇది గదిలోని ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తుంది. ఒకవేళ ఆగ్నేయంలో వీలు కాకపోతే తూర్పు లేదా దక్షిణం గోడలపై టీవీని ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ టీవీని వాయువ్యంలో పెడితే కుటుంబ సభ్యులు సమయం వృథా చేస్తారని, ఈశాన్యంలో ఉంచితే మానసిక ప్రశాంతత దెబ్బతింటుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాస్తు ప్రకారం తులసి వద్ద ఉంచకూడని వస్తువులు..!!
వాస్తు ప్రకారం తులసి వద్ద ఉంచకూడని వస్తువులు..!!

చిన్నపాటి మార్పులు చేస్తే చాలు

ఇవే కాకుండా లివింగ్ రూమ్‌లో మరికొన్ని చిన్నపాటి మార్పులు చేయడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచుకోవచ్చు. తూర్పు, ఉత్తరం వైపు ఉన్న కిటికీలను ఉదయం వేళ తెరిచి ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు తాజాదనం లభిస్తుంది. ఈశాన్య మూలలో మనీ ప్లాంట్ లేదా వెదురు మొక్కను ఉంచడం ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడుతుంది. గది గోడలకు లేత పసుపు, క్రీమ్ లేదా తెల్లటి రంగులు వాడటం ప్రశాంతతను ఇస్తుంది. అలాగే టీవీ చుట్టూ అనవసరమైన వైర్లు, వస్తువులు పేరుకుపోకుండా శుభ్రంగా ఉంచడం వల్ల మానసిక అలజడి తగ్గుతుంది. చివరగా, హాలు ప్రధాన ద్వారానికి నేరుగా అడ్డుగా సోఫాను లేదా నడిచే మార్గాలను మూసివేసేలా ఎలాంటి ఫర్నిచర్‌నూ అమర్చకూడదు. మీ ఇంటి నిర్మాణం, గది సైజును బట్టి ఈ చిన్నపాటి వాస్తు నియమాలు పాటిస్తే, మీ లివింగ్ రూమ్ అందంగా కనిపిస్తూనే ఇంట్లో లక్ష్మీకటాక్షాన్ని, సంతోషాన్ని నింపుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+