వాస్తు శాస్త్రం ప్రకారం ఆదివారం ఈ సంకేతాలు కనపడితే మీకు తిరుగులేదు
ఆదివారం అంటే సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు అంటే ఆత్మ కారకుడు, విజయానికి చిహ్నం. మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు భవిష్యత్తులో రాబోయే అదృష్టానికి సంకేతాలుగా నిలుస్తాయి. వాటిని జాగ్రత్తగా గమనించాలి.పేదలకు లేదా ఆవుకు గోధుమ రొట్టెలు తినిపిస్తే సూర్యుడి అనుగ్రహం రెట్టింపు అవుతుంది. సూర్య భగవానుడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేయడం వల్ల ఇంట్లోని దారిద్య్రం తొలగిపోతుంది. ముఖ్యంగా ఆదివారం రోజు మీ ఇంట్లో 3 అద్భుతమైన మార్పులు కనిపిస్తే, లక్ష్మీదేవి రాక మొదలైందని అర్థం. దీనిద్వారా త్వరలో రాజయోగం పట్టనుందని అర్థం చేసుకోవాలి.
అకస్మాత్తుగా సువాసన రావడం
కొన్నిసార్లు మనం ఇంట్లో ఎలాంటి సాంబ్రాణీ కడ్డీలు వెలిగించకపోయినా,
పచ్చని పూల మొక్కలు లేకపోయినా
గదిలోకి అడుగుపెట్టగానే ఒక తెలియని దివ్యమైన సువాసన
లేదా పూల పరిమళం మీ నాసికను తాకుతుంది.
వాస్తు ప్రకారం ఆదివారం రోజు ఇలాంటి అనుభూతి కలిగితే,
అది మీ ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశించిందనేదానికి నిదర్శనం.
ఇది మీ జీవితంలో కొత్త ఆరంభానికి, ఆగిపోయిన పనులు మళ్లీ మొదలవ్వడానికి సంకేతం.

పక్షుల కిలకిలారావాలు
ఉదయం 7.00 గంటల సమయంలో మీ ఇంటి ముంగిట
లేదా బాల్కనీలో పావురాలు, పిచుకలు గుంపుగా వచ్చి ఆనందంగా ఆడుకుంటున్నాయా?
అయితే ఇది మీరు కోరుకున్న విజయం దక్కబోతోందని చెప్పడానికి ప్రకృతి ఇచ్చే సంకేతం.
పక్షులు కిలకిలారావాలు చేస్తూ మీ ఇంటి పరిసరాల్లో తిరగడం అంటే..
ఆ ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోయాయని అర్థం.
శాస్త్రం ప్రకారం ఇలా జరిగితే త్వరలోనే మీకు భారీగా ఆర్థిక లాభం కలుగుతుంది.
స్వచ్ఛమైన నీటి ప్రతిబింబం
వాస్తు ప్రకారం నీరు అంటే సంపదకు మూలం.
మీ ఇంట్లో ఏర్పాటు చేసుకున్న వాటర్ ఫౌంటెన్ లేదా పూల కుండీల్లో
ఉంచిన నీరు అకస్మాత్తుగా ఎంతో స్వచ్ఛంగా, నిశ్చలంగా కనిపిస్తే
అది అదృష్ట సూచకమే. ఆ నీటిలో మీ ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తే,
మీ మనసులోని కోరికలు నెరవేరబోతున్నాయని,
వ్యాపార లాభాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటే అంతటి అదృష్టం మీ తలుపు తడుతుంది.












Click it and Unblock the Notifications