వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: ఎడమచేత్తో దానం చెయ్యకూడదా? ఎడమచేత్తో ఏం చేసినా ఫలితం ఉండదా?

|
Google Oneindia TeluguNews

ఎటువంటి మంచి పనులు చేయాలన్నా, ఏదైనా వస్తువులను పట్టుకోవాలన్నా, శుభకార్యాల సమయంలో ఏ పనులు చెయ్యాలన్నా పెద్దలు కుడి చేత్తోనే చెయ్యాలని సూచిస్తూ ఉంటారు. కుడి చేతికి అంతటి ప్రాధాన్యత ఉంది. ఇక కుడి చేతికి ఇచ్చిన ప్రాధాన్యత, ఎడమ చేతికి ఇవ్వరు. ఎడమ చేతితో ఏది ఇవ్వకూడదని, ఎడమచేతితో ఏ పని చేయకూడదని పెద్దలు చెప్పడం వెనుక చాలా ముఖ్యమైన కారణం ఉందని తెలుస్తుంది.

Astrology: శుక్రవారం నాడు మహిళలు అస్సలు చెయ్యకూడని పనులివే!!Astrology: శుక్రవారం నాడు మహిళలు అస్సలు చెయ్యకూడని పనులివే!!

ఎడమచేతిని ఏదైనా ఇచ్చేటప్పుడు ఎందుకు వాడకూడదంటే ...

ఎడమచేతిని ఏదైనా ఇచ్చేటప్పుడు ఎందుకు వాడకూడదంటే ...


హిందూ మతం ప్రకారం శరీరాన్ని రెండు భాగాలుగా విభజించారు. హిందూ మతం ప్రకారం నాభి నుండి కింద భాగాన్ని అధమ లేదా అపవిత్ర భాగంగా, నాభి నుండి తల వరకు ఉన్న భాగాన్ని ఉత్తమ లేదా పవిత్ర భాగంగా చెబుతారు. అంతేకాదు నిలువుగా కూడా రెండు భాగాలుగా శరీరాన్ని విభజించారు. ఎడమవైపు భాగాన్ని చంద్రభాగమని, కుడివైపు భాగాన్ని సూర్యభాగమనీ అంటారు. చంద్రుడు స్వయం ప్రకాశకుడు కానీ ఎప్పుడూ పూర్తిగా కనిపించడు. ఎప్పుడూ అసంపూర్ణంగానే ఉంటాడు. కానీ సూర్యుడు ఎప్పుడూ పూర్తిగా కనిపిస్తాడు. అందుకే సూర్యుడి భాగమైన కుడిచేతిని ఎవరికైన ఏదైనా ఇచ్చేటప్పుడు ఉపయోగిస్తే సంపూర్ణంగా ఉంటుందని, ఈ కారణంగానే కుడిచేతిని ఉపయోగించాలని పెద్దలు చెబుతారు. ఎడమ చేతిని ఉపయోగిస్తే , అసంపూర్ణంగా ఉంటుందని పెద్దలు చెబుతున్నారు.

హిందువులే కాదు, క్రైస్తవులు, గ్రీకులు, రోమన్లకు ఎడమ చెయ్యంటే చెడుకు సంకేతమే

హిందువులే కాదు, క్రైస్తవులు, గ్రీకులు, రోమన్లకు ఎడమ చెయ్యంటే చెడుకు సంకేతమే


ఒక హిందూ ధర్మం లోనే కాకుండా, క్రైస్తవ మతం లోనూ ఎడమవైపు చెడుగా భావించే పరిస్థితి ఉంది. దేవుని రాజ్యం గురించి చెప్పేటప్పుడు పుణ్యాత్ములు అంతా దేవుడికి కుడివైపు, పాపం చేసిన వాళ్లంతా దేవుడికి ఎడమవైపు ఉన్నట్టుగా వర్ణించడం ప్రధానంగా కనిపిస్తుంది. అందుకే ఎడమచేతికి ప్రాధాన్యత తక్కువ ఉంటుందని చెప్పబడింది. గ్రీకులు, రోమన్లు కూడా ఎడమ భాగాన్ని చెడుగా చూసేవారని తెలుస్తుంది. ఎడమ భుజం మీదుగా చీకట్లోకి చూస్తే దెయ్యాలు కనిపిస్తాయని వారు విశ్వసించే వారట. దుష్ట శక్తులు ఎడమ వైపు ఉంటాయని వారు నమ్మే వారట. ఇక ఆ విశ్వాసాలే అనేక దేశాలకు వ్యాప్తి చెందాయని చెబుతున్నారు.

 ఎడమ చేత్తో దానం మంచిది కాదని చెప్పటానికి కారణం ఇదే

ఎడమ చేత్తో దానం మంచిది కాదని చెప్పటానికి కారణం ఇదే


గ్రీకులు, రోమన్లు దుష్టశక్తులను తరిమికొట్టడానికి ఎడమ చేతి వేళ్ళకు రకరకాల ఉంగరాలను ధరించే వారని చెబుతున్నారు. నవ దంపతుల మీద చెడు ప్రభావం పడకుండా ఉండేందుకే, పెళ్లి సమయంలో ఎడమ చేతికి ఉంగరం పెట్టించడం మొదలు పెట్టారని, అదే తర్వాత సాంప్రదాయంగా మారిందని కూడా చెబుతారు. ఇలాంటి వాటిని బట్టే ఎడమ చేతికి ప్రాధాన్యత తగ్గింది. ఎడమచేతిని అధమంగా చూడడం మొదలైంది. అందుకే ఎడమ చేతితో దానం చేస్తే మంచిది కాదని పెద్దలు చెబుతూ ఉంటారు.

 ఎడమచేత్తో దానం మంచిది కాదా? కర్ణుడి దానం కథ

ఎడమచేత్తో దానం మంచిది కాదా? కర్ణుడి దానం కథ


అయితే నిజంగానే ఎడమ చేత్తో దానం చేస్తే మంచిది కాదా? అంటే ధర్మాన్ని అనుసరించే వారు మంచిదికాదని చెబుతుంటే, దానం చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు, మనసులో ఎటువంటి భేషజాలు లేనప్పుడు ఏ చేత్తో దానం చేసినా తప్పు లేదని చెబుతున్నారు కొందరు. అందుకు కృష్ణుడికి ఎడమచేతితో కర్ణుడు దానం చేసిన గిన్నె కు సంబంధించిన కథను గుర్తు చేస్తున్నారు. కృష్ణుడికి కర్ణుడు రత్నాలు పొదిగిన అత్యంత విలువైన ఒక గిన్నెను, కృష్ణుడు అడిగిన వెంటనే దానం చేశాడు. అయితే అప్పుడు కృష్ణుడికి కర్ణుడు ఎడమ చేత్తో ఆ గిన్నెను తీసి ఇచ్చాడు.

దానం ఏ చేత్తో చేసినా నిష్కల్మషం అయిన మనసు ఉండటం ప్రధానం

దానం ఏ చేత్తో చేసినా నిష్కల్మషం అయిన మనసు ఉండటం ప్రధానం


ఆ సమయంలో కృష్ణుడు కర్ణుడిని ఎడమ చేతితో ఇస్తున్నావు.. కుడి చేతితో ఇవ్వచ్చు కదా అంటూ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా కర్ణుడు ఎడమ చేతిలోని గిన్నె కుడి చేతిలోకి తీసుకునే లోపల ఏమవుతుందో తెలియదు. లక్ష్మీ చంచలమైనది కాబట్టి మనసు ఎలాగైనా మారొచ్చు అంటూ చెప్పి ధర్మ కార్యాన్ని చెయ్యాలని భావిస్తే తక్షణం, దానిని ఏమీ ఆలోచించకుండా చేయాలని చెప్పారు. అందుకే తన ఎడమ చేత్తో గిన్నె ఇచ్చానని కర్ణుడు సమాధానమిచ్చారు. ఇక దీనిని బట్టి ఎడమ చేతితో దానం చేసినా తప్పు లేదని కొందరు చెబుతున్నారు. నిష్కల్మషమైన మనసు ఉండటం ప్రధానం అని చెప్తున్నారు. కానీ మన శరీరంలో కుడి భాగాన్ని పవిత్రంగా భావిస్తారు కాబట్టి మంచి పనులు ఏమైనా చేస్తే కుడిచేత్తోనే చేయాలని పలువురు పెద్దలు చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Don't donate with left hand? Some people say that if you donate with your left hand, it will not work, while others say that if you donate with a good heart, it doesn't matter which hand you use.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X