Vastu tips: నిద్రలేచిన వెంటనే ఈ పనులు చేస్తున్నారా? అయితే చెడుఫలితాలు; రోజంతా చిరాకులు!!

ఇంటికి వాస్తు నియమాలు ఏ విధంగా అయితే వుంటాయో? ఇంట్లో జీవించే విధానానికి కూడా వాస్తు నియమాలు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం నిద్ర లేచిన దగ్గరనుంచి నిద్రపోయే వరకు కొన్ని నియమాలు పాటించాలని సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉదయం నిద్ర లేచిన వెంటనే చేయవలసిన పనులు, చేయకూడని పనుల పైన, వాస్తు శాస్త్ర నిపుణులు తమదైన సలహాలు ఇచ్చారు.

ఉదయం నిద్ర లేచిన వెంటనే ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు?

ఉదయం నిద్ర లేచిన వెంటనే ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు?

ఉదయం నిద్ర లేవగానే ఏం చేయాలి? ఏం చేయకూడదు అన్న అంశాలను గురించి చెబుతూ ఉదయం నిద్ర లేవగానే ఎప్పుడూ మన ముఖాన్ని కానీ, ఇంట్లో ఉన్న ఇతర కుటుంబ సభ్యుల ముఖాలను కానీ చూడకూడదు అని చెబుతున్నారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే మన రెండు అరచేతులను చూసుకొని తరువాత ఇష్ట దైవాన్ని ధ్యానం చేసి, బయటకు వచ్చి ప్రకృతిని చూడాలని సూచిస్తున్నారు. అలా కాకుండా ఏది పడితే అది చూసి, ఏం పని పడితే ఆ పని చేస్తే చెడు ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు.

నిద్ర లేచిన వెంటనే పాడైపోయిన గడియారాలు చూస్తున్నారా? అయితే చెడు కాలం

నిద్ర లేచిన వెంటనే పాడైపోయిన గడియారాలు చూస్తున్నారా? అయితే చెడు కాలం

చాలా మంది ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇంట్లో గడియారాలను చూస్తూ ఉంటారు. టైం ఎంతయిందో తెలుసుకోవడం కోసం చేసే ఈ ప్రక్రియ మంచిదే అయినప్పటికీ, పాడైపోయిన గడియారాలను చూడటం అశుభసూచకమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పాడైపోయిన గడియారాలను ఎట్టి పరిస్థితులలోనూ చూడకుండా ఉండాలి. ఒకవేళ అలా చూస్తే అది మనకు చెడు కాలాన్ని తీసుకువస్తుందని చెబుతున్నారు.

ఉదయం లేచిన వెంటనే అద్దంలో చూసుకుని, జుట్టు దువ్వుతున్నారా? అయితే నెగిటివ్ ఎనర్జీ

ఉదయం లేచిన వెంటనే అద్దంలో చూసుకుని, జుట్టు దువ్వుతున్నారా? అయితే నెగిటివ్ ఎనర్జీ

నిద్ర లేచిన వెంటనే అద్దంలో చూసుకొని, ఆ తర్వాత దువ్వెనతో జుట్టు దువ్వుకుంటారు కొందరు. ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకోవడం వల్ల అరిష్టం వస్తుందని, పొద్దున్నే జుట్టు దువ్వడం దురదృష్టాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. ఇది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతుందని, ఏ మాత్రం మంచిది కాదని సలహా ఇస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత అద్దంలో ముఖం చూసుకోవాలని, జుట్టు చదువుకోవాలని సూచిస్తున్నారు.

నిద్ర లేచిన వెంటనే వాటిని చూడకండి.. చెడు ఫలితాలు

నిద్ర లేచిన వెంటనే వాటిని చూడకండి.. చెడు ఫలితాలు

ఇక ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇంట్లో ఉన్న జంతువులు, పక్షుల ఫోటోలను చూడడం, లేదా పెంపుడు జంతువులను చూడడం ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. ఇంట్లో ఉన్నటువంటి జంతువుల, పక్షుల ఫోటోలను, పెంపుడు జంతువులను చూడడం వల్ల చెడు ఫలితాలు కలుగుతాయని ఎవరితోనైనా గొడవలు జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందుకే ఉదయం వాటి ముఖం చూడటం ఏ మాత్రం మంచిది కాదని సలహా ఇస్తున్నారు. ఆ అలవాటు ఉంటే మార్చుకోవాలని సూచిస్తున్నారు.

ఉదయం నిద్రలేచిన వెంటనే వాటి దగ్గరకు వెళ్ళకండి

ఉదయం నిద్రలేచిన వెంటనే వాటి దగ్గరకు వెళ్ళకండి

ఇక ఉదయం నిద్ర లేచిన వెంటనే చేయకూడని మరో పని రాత్రిపూట తిని వదిలేసిన ఎంగిలి గిన్నెల దగ్గరకు వెళ్లడం. ఎట్టి పరిస్థితులలోనూ ఉదయం రాత్రిపూట తిని వదిలేసిన ఎంగిలి గిన్నెలను చూడకూడదని చెబుతున్నారు. అసలు రాత్రి తిన్న పళ్ళాలు, గిన్నెలు రాత్రి శుభ్రం చేసుకోవాలని, అలా చేయకుండా ఉదయం వరకు ఉంచటం కూడా దరిద్రం అని చెబుతున్నారు. ఏది ఏమైనా ఉదయం నిద్ర లేచిన వెంటనే మన అర చేతులను చూసుకొని, ప్రశాంతంగా మన ఇష్టదైవాన్ని ధ్యానించి, బయటకు వెళ్ళి ప్రకృతిని ఆస్వాదించాలని, అప్పుడే ఆ రోజంతా మనం ప్రశాంతంగా ముందుకు వెళతామని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+