వాస్తు ప్రకారం ఇంట్లో బరువైన వస్తువులు ఎక్కడ ఉండాలో తెలుసుకోండి!
వాస్తు ప్రకారం నిర్మించుకున్న ఇంట్లోనే అనేక రకాల సందేహాలు మనకు తలెత్తుతూనే ఉంటాయి. ఒక్కోసారి ఒక్కోరకంగా వస్తుంటాయి. కొంతమందికి బరువైన వస్తువులు ఎక్కడ పెట్టాలి? అనే సందేహం తొలిచేస్తుంటుంది. కొందరైతే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటారు. అప్పుడు ఒక్కో నిపుణుడు ఒక్కోరకంగా చెబుతుంటారు. తర్వాత చుట్టుపక్కల వారు వచ్చి రకరకాలుగా చెబుతుంటారు. దీంతో ఎవరిని నమ్మాలో అర్థం కాదు. ఏం చేయాలో అర్థం కాదు. అందుకే అటువంటి సమస్యలకు పరిష్కారం తెలుసుకుందాం.
బరువైన బీరువా, బియ్యం బస్తాలు వంటివి నైరుతి మూల ఉండాలి.
వాస్తు ప్రకారం ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు.
కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
వాషింగ్ మెషిన్ కూడా బరువైన వస్తువే.
దాన్ని కూడా నైరుతి దిశలోనే పెట్టాలి.
హాల్లో ఖాళీ లేకపోతే దక్షిణం, పడమర మధ్యలో పెట్టాలి.
అప్పుడు ఎటువంటి వాస్తు దోషాలు తలెత్తవు.

నైరుతి దిశలో బరువైన వస్తువులను పెట్టడంవల్ల
ఆ ఇంటి యజమానికి స్థిరత్వాన్ని కల్పిస్తుంది.
దక్షిణం వైపు గోడకు ఫర్నిచర్, షోకేస్ లాంటివి పెట్టుకోవచ్చు.
సోఫాసెట్ ను పశ్చిమం లేదంటే దక్షిణం దిశలో పెట్టాలి.
డైనింగ్ టేబుల్ ను వాయువ్యంలో పెట్టాలి.
మెట్లు దక్షిణం లేదంటే పశ్చిమంలో పెట్టాలి.
స్టోర్ రూం నైరుతి భాగంలో ఉండాలి.
ఈశాన్యం మాత్రం ఎప్పుడూ ఖాళీగా ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
అక్కడ బరువైన వస్తువుంటే ఆర్థికంగా, ఆరోగ్య పరంగా నష్టాలు కలుగుతాయి.
ఇంటి మధ్య భాగం కూడా ఖాళీగా ఉండాలి. అది బ్రహ్మ స్థానం.
అక్కడ గోడకు బరువైన పిల్లర్లు ఉండకూడదు. ఫర్నిచర్ కూడా ఉండకూడదు.
గోడకు ఆనించి పెట్టకుండా కనీసం 3 అంగుళాల దూరం ఉంచుకోవాలి.
-
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: అనుకున్న పనులు నెరవేరతాయి.. నోరు అదుపులో ఉంచుకోవాలి -
వాస్తు ప్రకారం ఇంటి గోడల్లో దోషం ఉంటుందా? -
today rashiphalalu: ఆదాయం పెరిగి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి -
today rashiphalalu: భూమిని కానీ, వాహనాన్ని కానీ కొనుగోలు చేస్తారు -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!!












Click it and Unblock the Notifications