vastu tips: భార్యాభర్తల మధ్య గొడవలు దరిద్రానికి కారణం; లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే..!!

ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి కటాక్షం కోసం పూజలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందని, ధన ధాన్యాలు ప్రాప్తిస్తాయని నమ్ముతారు. ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటే మనిషి జీవితం సుఖంగా సాగిపోతుందని విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, కొన్ని తప్పులు చేయకుండా ఉండాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

గడపపైన కాలుపెట్టి నిలబడితే, చెప్పులు సింహ ద్వారం వద్ద పడేస్తే జరిగేదిదే

గడపపైన కాలుపెట్టి నిలబడితే, చెప్పులు సింహ ద్వారం వద్ద పడేస్తే జరిగేదిదే

ఇక ఆ వివరాల్లోకి వెళితే సింహద్వారం వద్ద చెప్పులు చిందరవందరగా పడవేస్తే ఆ ఇంటికి లక్ష్మీదేవి రాదని చెబుతున్నారు. అంతేకాదు గడప పైన కాలు పెట్టడం, గడపకు అటూ ఇటూ కాళ్ళు పెట్టి నిలబడి మాట్లాడడం, గడపని పదే పదే తొక్కడం వంటివి కూడా లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణం అవుతాయని చెబుతున్నారు. గడపకు పసుపు, కుంకుమలతో పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని, ప్రతి శుక్రవారం గడపను పసుపు, కుంకుమలతో పూజించాలని సూచిస్తున్నారు. ఎర్రని కుంకుమతో ఇంటి ప్రధాన ద్వారం పై స్వస్తిక్ గుర్తు వేసినా మంచిదని చెబుతున్నారు.

 ముగ్గులు వేయని ఇంటికి, శుభ్రంగా లేని ఇంటికి లక్షీదేవి రాదు

ముగ్గులు వేయని ఇంటికి, శుభ్రంగా లేని ఇంటికి లక్షీదేవి రాదు


ఇక శుచి, శుభ్రత ఉన్న ఇల్లు లక్ష్మీదేవి నివాసం ఉండే ఇళ్లని చెబుతున్నారు. తెల్లవారుజామునే వాకిలి ఊడ్చి శుభ్రం చేసి ముగ్గులు వేసిన ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతారు. అలా కాకుండా ముగ్గులు వేయని ఇంట్లోకి లక్ష్మీదేవి రాదని చెబుతున్నారు. అంతేకాదు ఇంట్లోని పనికిరాని వస్తువులు, చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పడేయాలి. చిరిగిపోయిన వస్త్రాలు ఇంట్లో అస్సలు ఉండకూడదు. ఇటువంటి వాటిని ఇళ్లల్లో ఉంచుకుంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని చెబుతున్నారు.

నిత్యం భార్యాభర్తలు గొడవ పడితే ఆ ఇంట్లో లక్షీదేవి ఉండదు

నిత్యం భార్యాభర్తలు గొడవ పడితే ఆ ఇంట్లో లక్షీదేవి ఉండదు


ఇంట్లో ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడటం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు. అదేవిధంగా ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరం ఘర్షణ పడతారో, ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదని చెబుతున్నారు. ఇంట్లో అబద్ధాలు చెప్పే వాళ్ళు, వేళకాని వేళలో భోజనం చేసేవారు, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రించేవారు, బద్ధకస్తులు ఉన్న ఇళ్ళల్లో లక్ష్మీదేవి ఉండదు అని చెబుతున్నారు.

పైసలు, అన్నం, పువ్వులను నిర్లక్ష్యం చేసినా లక్ష్మీదేవికి ఆగ్రహం

పైసలు, అన్నం, పువ్వులను నిర్లక్ష్యం చేసినా లక్ష్మీదేవికి ఆగ్రహం


అతిగా మాట్లాడే వారు, గురువులను, పెద్దలను అగౌరవపరిచే వారు, అపరిశుభ్రంగా ఉండే వారు ఉన్నచోట లక్ష్మీదేవి ఉండలేదని చెబుతున్నారు. చిల్లర పైసలు, పువ్వులు, అన్నాన్ని నిర్లక్ష్యం చేసే వారిపై లక్ష్మీ కటాక్షం ఉండదని చెబుతున్నారు. డబ్బులను ఎక్కడ పడితే అక్కడ పడేసే వారికి, డబ్బుల పట్ల నిర్లక్ష్యంగా ఉండేవారికి లక్ష్మీదేవి కటాక్షం ఉండదని చెప్తున్నారు.

లక్ష్మీ నివాసం ఉండేది ఇలాంటి వారి ఇళ్లలోనే

లక్ష్మీ నివాసం ఉండేది ఇలాంటి వారి ఇళ్లలోనే


ఉదయం,సాయంత్రం రెండు సమయాలలో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. సాయంసంధ్య వేళలో సాంబ్రాణి ధూపం వేస్తే కూడా మంచిదని చెబుతున్నారు. సత్ప్రవర్తన ఉన్న వారి పట్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఉంటుంది. సత్యాన్ని మాట్లాడేవారు, నిష్కల్మషమైన మనసు ఉన్నవారు, క్రమబద్ధమైన జీవితాన్ని పాటించేవారు లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారని చెబుతున్నారు. ఇక ఇటువంటి వారు ఉన్న ఇళ్లలో లక్ష్మీ దేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అని, వారు అష్టైశ్వర్యాలతో, ధన ధాన్యాలతో తులతూగుతూ ఉంటారని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+