vastu tips: వంట చేసేటప్పుడు ఈ నియమాలు పాటిస్తే ఆహారానికి లోటే ఉండదు!!
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించడమే కాకుండా, ముఖ్యంగా వంటింటిని, అందులో పెట్టే వస్తువులను కూడా వాస్తు ప్రకారం అమర్చుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉన్న వంటగది కుటుంబంలోని ప్రతి సభ్యునికి ఆహారాన్ని తయారుచేసే ప్రదేశం. ఇది మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో, వంటగదిలో ఏదైనా లోపం ఉంటే, అది కుటుంబ సభ్యులపై కూడా ప్రభావం చూపుతుంది.

వంట చేసే విషయంలో వాస్తు నియమాలు పాటించటం అవసరం
వాస్తు శాస్త్రం ప్రకారం వంట చేయటంలోనూ పలు నియమాలు ఉన్నాయని చెప్పబడింది. వాస్తు శాస్త్రం ప్రకారం వంట చేసేటప్పుడు తప్పులు చేయడం వల్ల గ్రహాల స్థితిపై చెడు ప్రభావం ఉంటుంది. దీనితో పాటు ఇంట్లో సుఖశాంతులు, కుటుంబ సౌభాగ్యం, ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుందని చెబుతున్నారు. వంట పదార్థాల విషయంలో ఏ వాస్తు నియమాలను పాటించాలో తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

అతిధులకు భోజనం పెట్టేలా వంట చేసుకోవాలి
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో సభ్యుల సంఖ్య కంటే ఎల్లప్పుడూ కాస్త ఎక్కువ వంట చేయాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులతో పాటుగా ఇంటికి వచ్చే అతిథులకు, లేదా ఆవుకి, కుక్కకు భోజనం పెడితే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి వచ్చిన అతిథి దేవుడిలాంటివాడు. అందుకే ఇంటికి వచ్చిన అతిథిని ఎప్పుడూ ఆకలితో పంపకూడదు. అందుకే అన్నపూర్ణ తల్లి అనుగ్రహం సదా నిలిచి ఉండాలంటే ఇంటికి వచ్చిన అతిథికి తప్పనిసరిగా భోజనం పెట్టు పంపించాలని చెబుతున్నారు .

వంట గదిలో శుభ్రత పాటించటం అవసరం
ఒకవేళ అతిథులు ఎవరూ రాకపోతే, వండిన భోజనాన్ని పశుపక్ష్యాదులకు పెట్టడం వల్ల శుభం చేకూరుతుందని చెబుతున్నారు. ఇలా చెయ్యటం వల్ల ఏమైనా దోషాలు ఉంటె తొలగిపోతాయని చెప్తున్నారు. ఇక ఇదే సమయంలో ఆహారాన్ని ఎప్పటికప్పుడు వండుకుంటే మంచిదని, ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన ఆహారాన్ని తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇక వంట చేసేటప్పుడు శుభ్రతను పాటించాలి అని, వంట చేసే పొయ్యిని శుభ్రంగా తుడుచుకుని తర్వాతనే వంట ప్రారంభించాలని సూచిస్తున్నారు.

అన్నం కూరలు వండేటప్పుడు ఈ పని చెయ్యకూడదు
ఇక అన్నం, కూరలు వండేటప్పుడు గరిటెలను గిన్నెలకు కొట్టకూడదని చెబుతున్నారు. అంతే కాదు వండిన ఆహారం మిగిలితే ఎవరికైనా దానం చేయాలి కానీ, డస్ట్ బిన్ లో పారేయకూడదని సూచిస్తున్నారు. సమయాన్ని బట్టి ఇంటికి వచ్చిన వారికి ఆహరం పెట్టాలని సూచించబడింది. వంట చేసే విషయంలోనూ వాస్తు నియమాలు పాటిస్తే అన్నపూర్ణ దేవి కటాక్షం ఎప్పటికీ ఉంటుందని, ఇంట్లో ఆహారానికి కొదవ ఉండదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications