వాస్తు ప్రకారం ఇంటి యజమాని ఏ దిక్కులో ఉండాలి? పెద్ద కొడుకు ఏ దిక్కులో ఉండాలి?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు కేవలం ఇటుకలు, సిమెంట్‌తో కట్టిన కట్టడం మాత్రమే కాదు, అది శక్తి ప్రసరించే ఒక క్షేత్రం. ఉత్తర ముఖద్వారం గల ఇంట్లో రెండు గదులు ఉన్నప్పుడు, కుటుంబ సభ్యుల హోదా, వయస్సును బట్టి గదుల కేటాయింపు ఎలా ఉండాలనేది చూద్దాం.
ఇంటి యజమానులైన తల్లిదండ్రులు ఎక్కడ ఉండాలి?
ఇంటికి పెద్ద దిక్కు అయిన తండ్రి లేదా యజమాని ఎప్పుడూ నైరుతి దిశలో ఉన్న గదిలోనే ఉండాలి.
నైరుతి మూల భూమికి సంకేతం. ఇది స్థిరత్వాన్ని, అధికారాన్ని, నిర్ణయ సామర్థ్యాన్ని ఇస్తుంది.
దక్షిణ వైరుతి లేదా పడమర నైరుతి భాగంలో ఉన్న గది యజమానికి మానసిక ప్రశాంతతను, కుటుంబంపై పట్టును ప్రసాదిస్తుంది.

ఇంటి పెద్ద కుమారుడికి ఏ గది ఉత్తమం?
మీరు ఇంటికి పెద్ద కుమారుడు, కొత్తగా వివాహం జరిగితే
వాయువ్యం దిశలో ఉన్న గదిని ఎంచుకోవడం ఉత్తమం.
వాయువ్యం చంద్రుడికి, వాయు దేవుడికి స్థానం.
కొత్తగా పెళ్లైన జంటలకు ఈ గదిలో ఉండటం వల్ల పరస్పర అవగాహన పెరుగుతుంది.
వాయువ్యం గమనానికి సంకేతం.
ఇది దంపతుల మధ్య సత్సంబంధాలను పెంపొందించడమే కాకుండా,
సామాజికంగా మంచి గుర్తింపు రావడానికి తోడ్పడుతుంది.
గదిలో వస్తువుల అమరిక ఎలా ఉండాలి?
గదిని ఎంచుకోవడంతో పాటు, గదిలో వస్తువుల అమరిక కూడా ముఖ్యం
నిద్రించేటప్పుడు తల ఎప్పుడూ దక్షిణం వైపు ఉండేలా చూసుకోవాలి.
ఇది శారీరక ఆరోగ్యానికి, ప్రశాంతమైన నిద్రకు మేలు చేస్తుంది.
గదిలో బరువున్న వస్తువులు లేదా నగలు దాచుకునే బీరువాలను గదికి నైరుతి భాగంలో ఉండాలి.
అవి ఉత్తరం వైపు తెరుచుకునేలా అమర్చుకోవాలి.
ఇంటి ఈశాన్య మూల ఎప్పుడూ ఖాళీగా, శుభ్రంగా ఉండాలి.
అక్కడ బరువులు పెట్టకూడదు.
ఈ దిశలో దేవుడి గది లేదా ధ్యానం చేసుకునే స్థలం ఉంటే చాలా మంచిది.
వంటగది సాధారణంగా ఆగ్నేయ మూలలో ఉంటుంది.
వంట చేసేటప్పుడు తూర్పు ముఖంగా నిలబడి వండటం శుభప్రదం.












Click it and Unblock the Notifications