vastu tips: వాస్తు ప్రకారం అదృష్టం కలిసిరావడానికి ఇంట్లో వీటిని పెట్టండి

హిందూ సాంప్రదాయం, వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో కొన్ని రకాల బొమ్మలు లేదా చిత్రపటాలను ఉంచడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి, లక్ష్మీదేవి అనుగ్రహం, సంపద, సానుకూల శక్తి లభిస్తాయి. వాస్తు ప్రకారం ఇంట్లో ఎలాంటి బొమ్మలు ఉంచాలో తెలుసుకుందాం.

దేవతా మూర్తుల బొమ్మలు

లక్ష్మీదేవి - కుబేరుడు: ఇంట్లో ఎప్పుడూ కూర్చుని ఉన్న లక్ష్మీదేవి, వినాయకుడు, కుబేరుడి ఫోటోలు లేదా విగ్రహాలు ఉండాలి. ముఖ్యంగా లక్ష్మీదేవి తామరపువ్వుపై కూర్చుని, చేతి నుండి నాణాలు రాలుతున్నట్లు ఉండే చిత్రం చాలా శుభప్రదం. వాస్తు ప్రకారం, ఉత్తర లేదా తూర్పు దిశలో లక్ష్మీదేవికి ఇష్టమైన తెల్లని ఏనుగుల జంట బొమ్మలను ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

Vastu tips Place these items in your home to attract good luck according to the principles

జంతువులు, పక్షుల బొమ్మలు

పరిగెడుతున్న ఏడు తెల్లని గుర్రాల పెయింటింగ్ లేదా ఫోటోను ఇంటి లివింగ్ రూమ్‌లో తూర్పు లేదా ఉత్తర గోడకు తగిలించాలి. ఇది వ్యాపారంలో అభివృద్ధిని, ఇంట్లో సానుకూల శక్తిని, పురోగతిని తెస్తుంది. హిందూ మతంలో ఆవును మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఇంట్లో దూడకు పాలిస్తున్న ఆవు బొమ్మ లేదా విగ్రహాన్ని ఈశాన్య మూలలో ఉంచడం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది. ఇంట్లో జంట హంసల బొమ్మలు లేదా ఫోటోలు ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య అనుభందం పెరిగి, మనశ్శాంతి లభిస్తుంది.

వాస్, చైనీస్ వాస్తు బొమ్మలు

లాఫింగ్ బుద్ద: నవ్వుతున్న బుద్ధుడి బొమ్మను ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా లేదా లివింగ్ రూమ్‌లో ఉంచడం వల్ల ఇంట్లోకి సంతోషం, సంపద వస్తాయి. చేతులు పైకెత్తి ఉన్న లేదా డబ్బు మూట పట్టుకున్న లాఫింగ్ బుద్ద బొమ్మలు మరింత మంచివి. నోట్లో నాణెం ఉన్న మూడు కాళ్ల కప్ప బొమ్మను ఇంటి లోపలికి చూస్తున్నట్లుగా (ముఖ్యంగా ఉత్తర దిశలో) ఉంచితే డబ్బు నిలకడగా ఉంటుంది. ఇంట్లో వెండి, రాగి లేదా గాజుతో చేసిన తాబేలును ఉత్తర దిశలో నీటి పాత్రలో ఉంచడం వల్ల ఇంట్లోని నెగెటివిటీ పోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

ప్రకృతి చిత్రాలు

జలపాతం, పచ్చదనం: ఇంటి ఈశాన్య లేదా ఉత్తర దిశలో ప్రవహించే నీరు లేదా పచ్చని ప్రకృతి దృశ్యాలు ఉన్న చిత్రాలను ఉంచాలి. ఇది ధన ప్రవాహాన్ని పెంచుతుంది. ఇంట్లో దరిద్రం పోవాలంటే... యుద్ధ రంగ దృశ్యాలు, తాజ్ మహల్, నటరాజు విగ్రహం, ఒంటె బొమ్మలు, ఎండిపోయిన చెట్లు, ఏడుస్తున్నట్లు ఉండే బొమ్మలను అస్సలు ఉంచకూడదు. ఇవి ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి. దరిద్రాన్ని కూడా పెంచుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+