• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: భార్యాభర్తల మధ్య గొడవలా? అయితే ఈ సింపుల్ వాస్తుచిట్కాలు ట్రై చెయ్యండి!!

|
Google Oneindia TeluguNews

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి వాస్తు ఏ విధంగా అయితే అవసరమో.. జీవితం సాఫీగా సాగడానికి వాస్తు నియమాలు పాటించటం అంతే అవసరం. వాస్తు నియమాలను సక్రమంగా పాటించకుంటే ఇంట్లో ప్రతికూల ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇది వ్యక్తి యొక్క పురోగతి, ఆర్థిక స్థితి మరియు వైవాహిక జీవితంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. చాలా సార్లు, ఈ వాస్తు దోషాల కారణంగా, వైవాహిక జీవితంలో చాలా ప్రభావం ఏర్పడుతుంది. కొన్ని సమయాల్లో వైవాహిక సంబంధం కూడా విచ్ఛిన్నమవుతుంది.

వివాహం చేసుకున్న జంట వాస్తు నియమాలు పాటించకుంటే కుటుంబ కలహాలు

వివాహం చేసుకున్న జంట వాస్తు నియమాలు పాటించకుంటే కుటుంబ కలహాలు

ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న ప్రతి జంట సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఎంత అవసరమో, కొన్ని సందర్భాల్లో వాస్తు శాస్త్ర నియమాలను పాటించడం కూడా అంతే అవసరం. వివాహమైన తర్వాత ఇంట్లో అనవసరమైన కలహాలు కలుగుతుంటే, చిన్న చిన్న విషయాలకే వివాదాలు చోటు చేసుకుంటే ఆ ఇంట్లో కొద్దిపాటి వాస్తు మార్పులు చేయాలనేది అందరూ అర్థం చేసుకోవాల్సిన అంశం. అలా చిన్నచిన్న వాస్తు మార్పుల ద్వారా వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.

 వైవాహిక జీవితం సంతోషంగా ఉండటానికి వాస్తు చిట్కాలు

వైవాహిక జీవితం సంతోషంగా ఉండటానికి వాస్తు చిట్కాలు

సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం, భాగస్వాముల మధ్య ఆలోచనలు స్పష్టంగా ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల, ఆలోచనలను స్థిరంగా ఉంచడానికి, ఈశాన్య దిశలో నీలం లేదా ఊదా రంగును ఉపయోగించండి. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం భార్య భర్తలు ఉండే పడకగది నైరుతి దిశ లోనే ఉండాలి. ఈ దిశలో ఉండటం వల్ల వైవాహిక జీవితం పై మంచి ప్రభావం ఉంటుంది.

 పడకగదిలో ఇవి ఉంటే ప్రతికూల ఫలితం

పడకగదిలో ఇవి ఉంటే ప్రతికూల ఫలితం


పడకగదిని ఎన్నుకునేటప్పుడు, అది చతురస్రం లేదా దీర్ఘచతురస్రాకారంగా ఉండాలని గుర్తుంచుకోండి. పడక గదిలో ఎప్పుడు మెటల్ బెడ్ ఉపయోగించవద్దు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇనుముతో చేసిన మంచాలను ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. దీనితో పాటు, వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.అంతేకాదు వాస్తు శాస్త్రం ప్రకారం, పడకగదిలో అద్దం ఉంచేటప్పుడు, నిద్రిస్తున్నప్పుడు మీ ఆకారం అందులో కనిపించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అలా అద్దంలో మీరు పూర్తిగా కనిపిస్తుంటే వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి.

ఎలక్ట్రానిక్ వస్తువులు బెడ్ రూమ్ లో ఉండకుండా చూసుకోండి

ఎలక్ట్రానిక్ వస్తువులు బెడ్ రూమ్ లో ఉండకుండా చూసుకోండి


నేటి కాలంలో కంప్యూటర్లు, ల్యాప్ ట్యాప్ లు రెండూ చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడుతున్నాయి. కానీ వాస్తు ప్రకారం వాటిని పడక గదిలో ఉంచకూడదు. మీ గదిలో అవి ఉంటే, రాత్రి పడుకునే ముందు వాటిని కనిపించకుండా కవర్ చేయండి. బెడ్ రూమ్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. బెడ్ రూం లో పడుకునే వారికి ఆహ్లాదకర వాతావరణం ఉండాలి. అలా కాకుండా ఎలక్ట్రానిక్ వస్తువులను బెడ్ రూమ్ లో పెడితే అది వారి ప్రశాంతతను దూరం చేసే చిరాకు పెట్టిస్తుంది. ఫలితంగా భార్యాభర్తల మధ్య అనవసరపు గొడవలు చోటుచేసుకుంటాయి.

 వైవాహిక జీవితంలో ప్రేమ ఉండాలంటే ఈ పని చెయ్యండి

వైవాహిక జీవితంలో ప్రేమ ఉండాలంటే ఈ పని చెయ్యండి

ఇక వైవాహిక జీవితంలో ప్రేమను కొనసాగించాలంటే, ఫ్యామిలీ ఫోటో లను నైరుతిలోనే పెట్టాలి. కుటుంబం ప్రేమపూర్వకంగా ఉన్న ఫోటోలను నైరుతిదిశలో కానీ, పశ్చిమ దిశలో గాని పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మీలో ప్రేమ పెరిగేలా పడక గది వాతావరణం ఆహ్లాదంగా ఉండాలి తప్ప ఆశుభ్రంగా, చెత్తగా, అనవసరపు వస్తువులు పెట్టి ఉంటే కచ్చితంగా ఫలితం ప్రతికూలంగా ఉంటుంది.

English summary
If a married couple does not follow Vastu rules, there will be family quarrels. Vastu Shastra experts say that if you follow small Vastu tips, the reciprocity between husband and wife will increase.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X