vastu tips: వాస్తు ప్రకారం అలోవేరా మొక్కను ఇంట్లో పెంచాలా?

చాలామంది కలబందను కేవలం చర్మాన్ని మెరిపించే అందమైన చిట్కాగానే చూస్తారు. కానీ, వాస్తు, ఫెంగ్ షూయ్ శాస్త్రాల ప్రకారం ఈ చిన్న మొక్క ఇంట్లో ఉంటే ఆరోగ్యంతో పాటు అపారమైన ధన ప్రాప్తి కూడా లభిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ప్రతికూల శక్తులను తరిమికొట్టి, అదృష్టాన్ని మోసుకొచ్చే కలబంద మొక్క విశేషాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

vastu tips: ఎంత చిత్రంగా ఉంది.. ఇంట్లో ఉండే పాత సూట్‌కేస్‌‌కు వాస్తు ఉంటుందంట!
vastu tips: ఎంత చిత్రంగా ఉంది.. ఇంట్లో ఉండే పాత సూట్‌కేస్‌‌కు వాస్తు ఉంటుందంట!

ప్రతికూల శక్తులకు చెక్

ఫెంగ్ షూయ్ ప్రకారం, కలబంద మొక్క ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని పీల్చేసి, పాజిటివ్ ఎనర్జీని వ్యాప్తి చేస్తుంది. ఇంట్లో నిరంతరం గొడవలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఈ మొక్కను పెంచుకోవడం వల్ల మనశ్శాంతి లభించడమే కాకుండా, ధన ప్రవాహం పెరుగుతుంది. సాధారణంగా కలబంద మొక్క పుష్పించడం చాలా అరుదు. కొన్ని సంవత్సరాల వయసు వచ్చిన తర్వాతే ఇది ఏడాదవునా ఒకసారి ఆరెంజ్ రంగులో వికసిస్తుంది. వాస్తు ప్రకారం, ఎవరి ఇంట్లో అయితే కలబంద మొక్క పువ్వు పూస్తుందో, వారికి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. ముఖ్యంగా అప్పుల బాధల నుంచి ఉపశమనం లభించి, ఆర్థిక స్థిరత్వం చేకూరుతుందని నిపుణులు విశ్వసిస్తారు.

vastu tips: వాస్తు ప్రకారం రాత్రిపూట ఈ 3 పనులు వద్దు.. లక్ష్మీదేవి దూరమవుతుంది!
vastu tips: వాస్తు ప్రకారం రాత్రిపూట ఈ 3 పనులు వద్దు.. లక్ష్మీదేవి దూరమవుతుంది!
Vastu tips Should an aloe vera plant be grown at home according to the principles

కలబందను ఇంట్లో ఏ ప్రదేశంలో ఉంచాలి?

కలబంద మొక్క ఇచ్చే శుభ ఫలితాలు పూర్తిగా దక్కాలంటే దాన్ని సరైన దిశలో, సరైన ప్రదేశంలో ఉంచడం చాలా ముఖ్యం. కలబంద సూర్యుని కాంతిని గ్రహించినప్పుడే దాని శక్తి రెట్టింపవుతుంది. కాబట్టి కిటికీల వద్ద, బాల్కనీలలో లేదా కాంతి బాగా వచ్చే షెల్ఫ్‌లపై ఉంచాలి. కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండే హాలులో లేదా వంటగదిలో సూర్యకాంతి పడేలా దీన్ని అమర్చుకుంటే ఇంట్లోని శక్తి సామర్థ్యాలు పెరిగి, కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం పెరుగుతుంది. అటు ఆరోగ్యానికి, ఇటు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలకు దివ్యౌషధంగా పనిచేసే ఈ కలబంద మొక్కను మీ ఇంట్లో సరైన స్థానంలో నాటుకుని, అదృష్టాన్ని మీ సొంతం చేసుకోండి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+