వాస్తు ప్రకారం దేవుడి గది ప్రత్యేకంగా ఉండాలా? మరణించినవారి ఫొటోలు ఉండొచ్చా?
వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నప్పుడు దేవుడికి ప్రత్యేక గది ఉండాలా? లేదంటే చిన్న మందిరం కట్టుకోవాలా? అన్న సందేహం అందరినీ వెంటాడుతుంటుంది. కొంతమంది నిపుణులు కొన్ని కొన్ని రకాలుగా చెబుతుంటారు. దీనిపై ఎటువంటి స్పష్టత లేకుండానే చాలామంది ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేసేస్తారు. అయితే ఒక్కో వాస్తు నిపుణులు ఒక్కో రకంగా చెబుతుంటారు. ఒక్కొక్కరి అభిప్రాయాలను బట్టి అది మారుతూ వస్తుంటుంది. దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలను మనం తెలుసుకుందాం.
వాస్తవానికి అందరూ దేవుడి మందిరాన్ని ఈశాన్య దిక్కులో పెట్టుకుంటారు.
కానీ ఆ దిక్కులో ఎటువంటి బరువు ఉండకూడదు.
అక్కడ ఏమీ లేకుండా ఖాళీగా ఉందంటేనే అర్థం దేవుడున్నాడని.
కాబట్టి భగవంతుడి ఫొటోలను పెట్టాల్సిన అవసరం లేదు.
ఈశాన్యం మూల దీపారాధానలు చేయకూడదని కొందరు చెబుతుంటారు.
నైరుతి మూల కాకుండా పడమర గోడకు పెట్టి, దేవుడి ముఖం తూర్పున ఉండేలా చూసుకోవాలంటారు.
హాల్లో పెట్టుకుంటే దేవుడి ముఖం పడమర చూడాలంటారు.
మన ఇంట్లో మరణించిన పెద్దల ఫొటోలను కూడా దేవుడి గదిలో పెట్టుకోవచ్చు.
వాళ్లకు పూజలు కూడా చేసుకోవచ్చు.

వాస్తు ప్రకారం దేవుడి గది ప్రత్యేకంగా ఉంటే ప్రార్థన సమయంలో మనస్సు ఏకాగ్రతతో ఉంటుంది.
దేవుడి గది పడకగదికి ఆనుకుని ఉండకూడదు.
ముఖ్యంగా దేవుడి పటాలు ఉన్న గోడకు వెనుక వైపు బాత్‌రూమ్ లేదా టాయిలెట్ అస్సలు ఉండకూడదు.
పొరపాటున కూడా మెట్ల కింద దేవుడి గదిని నిర్మించకూడదు. ఇది వాస్తు రీత్యా తీవ్ర దోషం.
చాలామంది భక్తితో లేదా ప్రేమతో మరణించిన తమ పెద్దల ఫోటోలను దేవుడి గదిలో పెడుతుంటారు.
కొంతమంది వాస్తు నిపుణులు పెట్టొచ్చంటారు.
మరికొంతమంది నిపుణులు పెట్టొద్దంటారు.
మీకు సమీపంలోని నిపుణుల అభిప్రాయాన్ని ఈ విషయంలో తీసుకోండి.
శాస్త్రం ప్రకారం దేవుళ్లు 'అమరులు', పితృదేవతలు వేరు.
దేవుడి గదిలో దైవ శక్తులు ఉంటాయి.
పితృదేవతల ఫోటోలు అక్కడ ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగే అవకాశం ఉంటుంది.
మరణించిన వారి ఫోటోలను ఇంటికి దక్షిణం లేదా నైరుతి దిశలో ఉన్న గోడలకు తగిలించాలి.
ఫోటోలు ఉత్తరం వైపు చూస్తున్నట్లు ఉండాలి.
దేవుడి పటాల మధ్యలో లేదా దేవుడి కంటే ఎత్తులో పితృదేవతల ఫోటోలు పెట్టకూడదు.
కాళికా మాత లేదా ఇతర ఉగ్ర రూపంలో ఉన్న దేవతా మూర్తుల ఫోటోలను
పూజ గదిలో ఉంచకపోవడమే మంచిది.
ప్రశాంతమైన ముఖవర్చస్సు ఉన్న పటాలను ఎంచుకోవాలి.
-
వాస్తు ప్రకారం ఇంటికి 2 ప్రధాన ద్వారాలు ఉండొచ్చా? -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications