Vastu tips: ఇంటికి దక్షిణ ఆగ్నేయం వీధిపోటు.. ఆ ఇంట్లో వాళ్ళ పంట పండినట్టే!!

వాస్తు శాస్త్రంలో వీధిపోట్లను గురించి తెలుసుకోవడం చాలా అవసరం. సహజంగా వీధిపోటు అనగానే దానిని ఆశుభంగా చాలా మంది పరిగణిస్తారు. ఏదైనా ఇల్లు కొనుగోలు చేయాలంటే ఆ ఇంటికి వీధిపోటు ఉంటే కొనుగోలు చేయకుండా వెనక్కి పోతారు. అయితే అన్ని వీధిపోట్లు డేంజర్ కాదని, కొన్ని వీధిపోట్లు మాత్రమే ప్రమాదమని వాస్తు శాస్త్రం చెప్తుంది.

వీధి పోట్లను గుర్తించే విషయంలో జాగ్రత్త

వీధి పోట్లను గుర్తించే విషయంలో జాగ్రత్త


స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు స్థలం యొక్క ఆకారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాదు స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు వీధిపోటు విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. వీధి పోట్లను గుర్తించి ఆయా వీధిపోట్లు మనకు మంచి చేస్తాయా? చెడు చేస్తాయా? అనేది తెలుసుకోవాలి.

దుష్ప్రభావాలను కలిగించే, మంచిని సూచించే వీధిపోట్లు ఇవే

దుష్ప్రభావాలను కలిగించే, మంచిని సూచించే వీధిపోట్లు ఇవే

ముఖ్యంగా ఉత్తర వాయువ్య వీధిపోటు, పశ్చిమ నైరుతి వీధిపోటు, దక్షిణ నైరుతి వీధిపోటు, తూర్పు ఆగ్నేయ వీధి పోటు మంచివి కావని చెబుతూ ఉంటారు. ఈ వీధి పోటు ఉంటే అటువంటి స్థలాలను కొనుగోలు చెయ్యకూడదని చెబుతారు. ఇక పశ్చిమ వాయువ్యం వీధిపోటు, ఉత్తర ఈశాన్యం వీధిపోటు, తూర్పు ఈశాన్యం వీధిపోటు , దక్షిణ ఆగ్నేయం వీధి పోటు ఎంతో లాభాన్ని చేకూరుస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఇంటికి దక్షిణ ఆగ్నేయం వీధిపోటు ఉంటే కలిగే ఫలితం ఇదే

ఇంటికి దక్షిణ ఆగ్నేయం వీధిపోటు ఉంటే కలిగే ఫలితం ఇదే

ఇక ఇంటికి మంచి చేసే వీధిపోట్లలో దక్షిణ ఆగ్నేయం వీధి పోటు ఉంటే ఆ ఇల్లు చాలా మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక దక్షిణ ఆగ్నేయం వీధి పోటు ఉన్న స్థలాన్ని కొనుగోలు చేయవచ్చని, అందులో గృహ నిర్మాణం కూడా మంచిదని సూచిస్తున్నారు. దక్షిణ నైరుతి వీధి పోటు ఎంత డేంజరో.. దక్షిణ ఆగ్నేయం వీధి పోటు అంత మంచిదని చెబుతున్నారు. దక్షిణ ఆగ్నేయం వీధి పోటు ఉన్న ఇంట్లో నివసించే వారు చాలా ఆనంద ప్రదమైన జీవితాన్ని అనుభవిస్తారని, వారికి డబ్బు కు ఎటువంటి కొదవ ఉండదని చెబుతున్నారు.

ధనధాన్యాలు... సుఖ సంతోషాలు .. ఈ వీధిపోటు ప్రభావం

ధనధాన్యాలు... సుఖ సంతోషాలు .. ఈ వీధిపోటు ప్రభావం

ఇక దక్షిణ ఆగ్నేయం వీధి పోటు ఉన్న ఇంట్లో నివసించే మహిళల ఆరోగ్యానికి ఎటువంటి కొదవ ఉండదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడూ దక్షిణ ఆగ్నేయం వీధి పోటు ఉన్న ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతూ ఉంటుందని, బంధుమిత్రుల తో కళకళ లాడుతూ ఉంటుంది అని చెబుతున్నారు. దక్షిణ ఆగ్నేయం వీధి పోటు ఉన్న ఇంట్లో నివసించే ఆడవాళ్ళు చదువుల సరస్వతి లాగ రాణిస్తారని, చదువులలో వారు వెనక్కి తిరిగి చూసే అవకాశమే ఉండదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

దక్షిణ ఆగ్నేయం వీధిపోటు ఉంటే పేరు ప్రతిష్టలు

దక్షిణ ఆగ్నేయం వీధిపోటు ఉంటే పేరు ప్రతిష్టలు


ఇక దక్షిణ ఆగ్నేయం వీధి పోటు ఉన్న ఇంట్లో నివసించే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంటున్నారు. మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు అని చెబుతున్నారు. అందుకే దక్షిణ ఆగ్నేయం వీధి పోటు అన్ని విధాలా శ్రేష్టం కలిగించటం వల్ల, ఈ వీధి పోటు ఉన్న ఇంటిని కానీ, స్థలాన్ని కానీ కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నారు.జీవితంలో సుఖశాంతులు, సక్సెస్ అన్నీ ఒక్కోసారి వీధి పోట్లు నిర్ణయం చేస్తాయి. కాబట్టిమంచి వీధిపోటు ఉన్న ఇళ్ళను కొనుగోలు చెయ్యటం చాలా ఎంతో అవసరం అని సలహా ఇస్తున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+