vastu tips: ఇంట్లో గొడవలు లేకుండా ఉండాలంటే ఇలా చేయాలి

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చిన్నచిన్న విషయాలకే దంపతుల మధ్య మనస్పర్థలు రావడం, కుటుంబంలో మనశ్శాంతి కరువడం సర్వసాధారణమైపోయింది. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం.. మన ఇంట్లోని వస్తువుల అమరిక, గదుల దిశలు కూడా మన మానసిక స్థితిపై, బంధాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇంట్లో సానుకూల శక్తి ని పెంచి, భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగాలను చిగురింపజేసేందుకు వాస్తు నిపుణులు సూచిస్తున్న కొన్ని అద్భుతమైన చిట్కాలు తెలుసుకుందాం.

బెడ్‌రూమ్ ఇలా ఉంటే.. బంధం మరింత గట్టిపడుతుంది!

దాంపత్య జీవితంలో సంతోషానికి, ప్రశాంతతకు పడకగది వాస్తు అత్యంత కీలకం. ఇక్కడ కొన్ని చిన్న మార్పులు చేయడం ద్వారా దంపతుల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది. ఇల్లాలు, ఇల్లెందులు ప్రశాంతంగా ఉండేందుకు పడకగది ఎప్పుడూ నైరుతి దిశలో ఉండటం చాలా మంచిది. పడుకునేటప్పుడు తల భాగం దక్షిణం లేదా పడమర దిశ వైపు ఉండేలా చూసుకోవాలి. ఇది ప్రశాంతమైన నిద్రను ఇవ్వడమే కాక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గోడలకు ముదురు రంగులు అస్సలు వేయకూడదు. లేత గులాబీ, లైట్ బ్లూ లేదా క్రీమ్ వంటి ప్రశాంతమైన రంగులు మానసిక ఒత్తిడిని తగ్గించి, దంపతుల మధ్య శృంగార భావనలను పెంపొందిస్తాయి. బెడ్‌రూమ్‌లో పగిలిన అద్దాలు, గాజు వస్తువులు, అక్వేరియం ఉంచకూడదు. అలాగే కత్తులు, కత్తెరలు, సూదులు వంటి పదునైన వస్తువులను పడకగదికి దూరంగా ఉంచడం శ్రేయస్కరం.

vastu tips: వంటగదిలో వాడే పెనంకు కూడా వాస్తు ఉందంటే ఆశ్చర్యపోతారు
vastu tips: వంటగదిలో వాడే పెనంకు కూడా వాస్తు ఉందంటే ఆశ్చర్యపోతారు
Vastu tips These Simple Steps Can Help Prevent Conflicts at Home

డైనింగ్ టేబుల్ వద్ద ఐక్యత!

కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసే ప్రదేశం ఇంట్లో ప్రేమానురాగాలకు ప్రతీక. అందుకే డైనింగ్ ఏరియాలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి. డైనింగ్ టేబుల్‌ను ఇంటి తూర్పు లేదా పడమర దిశలలో అమర్చాలి. వాస్తు ప్రకారం రౌండ్ లేదా ఓవల్ షేప్ కంటే దీర్ఘచతురస్రాకార టేబుల్ అత్యంత అనుకూలమైనది. కుటుంబ పెద్ద భోజనం చేసేటప్పుడు ఆయన ముఖం ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండేలా కూర్చోవడం గౌరవాన్ని, సంతోషాన్ని పెంచుతుంది. రోజులో కనీసం ఒక్కసారైనా కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేయడం వల్ల మనస్పర్థలు తొలగిపోయి బంధాలు బలపడతాయి.

vastu tips: ఇంట్లో ఈ దిశలో దీపం వెలిగించండి.. లక్ష్మీదేవి నడిచొస్తుంది
vastu tips: ఇంట్లో ఈ దిశలో దీపం వెలిగించండి.. లక్ష్మీదేవి నడిచొస్తుంది

వంటగది.. ఇంటి శక్తి కేంద్రం!

వంటగది కేవలం ఆహారాన్ని వండే స్థలం మాత్రమే కాదు, అది ఇంటి ఆర్థిక, ఆరోగ్య స్థితిని శాసించే శక్తి కేంద్రం. వంటగది ఎప్పుడూ అగ్ని తత్వానికి ప్రతీక అయిన ఆగ్నేయ దిశలో ఉండాలి. కిచెన్‌లో లేదా ఇంట్లో ఎక్కడైనా నీటి పైపులు లీక్ అవుతుంటే వెంటనే రిపేర్ చేయించాలి. నీరు వృధాగా కారడం వల్ల ఆర్థిక నష్టాలతో పాటు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. వంటగదిని ఎల్లప్పుడూ క్లీన్‌గా ఉంచుకోవాలి. రాత్రి పూట ఎంగిలి పాత్రలను సింక్‌లో అలాగే వదిలేయడం, చెత్తను పేరుకుపోనివ్వడం వల్ల ఇంట్లో గొడవలు జరిగే ఆస్కారం ఉంది. ఇల్లు అందంగా ఉండటమే కాదు.. అక్కడ ప్రశాంతత కూడా ఉండాలి. వాస్తు శాస్త్రం చెప్పే ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించడం ద్వారా ప్రతికూల శక్తులు నశించి, ఇల్లు ఆనందాల హరివిల్లుగా మారుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+