• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: ఆగ్నేయంలో వాస్తుదోషాలు యమా డేంజర్; సరిచేసుకోకుంటే సర్వనాశనం తధ్యమట!!

|
Google Oneindia TeluguNews

తూర్పు, దక్షిణ దిక్కుల మధ్య ఉండే మూలను ఆగ్నేయంగా చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది ఆగ్నేయ దిశలో ఉంటుంది. అయితే ఆగ్నేయం దిశలో వాస్తు దోషాలు ఉంటే మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మిగతా అన్ని దిశల కంటే ఆగ్నేయ దిశ పై అత్యంత సూక్ష్మంగా శ్రద్ధ వహించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఏమాత్రం పొరపాటు చేసినా విపరీతమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.

ఆగ్నేయంలో వాస్తు సరిగ్గా ఉంటే అన్నీ శుభాలే

ఆగ్నేయంలో వాస్తు సరిగ్గా ఉంటే అన్నీ శుభాలే

ఆగ్నేయ దిశలో ఎటువంటి దోషాలు లేకపోతే ఆ కుటుంబంలో సుఖ శాంతులు ఉంటాయని, కుటుంబ సభ్యులకు కీర్తి లభిస్తుందని, విలాసవంతమైన జీవితం చేకూరుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. భార్యాభర్తల మధ్య అనుబంధాలు బలపడతాయి అని, వారి దాంపత్య జీవితం సుఖంగా ఉంటుందని చెబుతారు. ఇంటికి వచ్చే అతిధులకు గొరవం దక్కుతుంది. భార్యకు భర్తపై ప్రేమ, భర్తకు భార్యపై ప్రేమ పుష్కలంగా ఉంటుంది. ఇక ఆగ్నేయ దిశలో వాస్తు దోషాలు ఉంటే ఎన్ని కావాలంటే అన్ని దుష్ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

ఆగ్నేయంలో వాస్తు దోషం ఉంటే సర్వ నాశనమే

ఆగ్నేయంలో వాస్తు దోషం ఉంటే సర్వ నాశనమే

ఆగ్నేయంలో నైరుతి కంటే ఎత్తు పెరిగినా, గోతులున్నా, ద్వారం ఉన్నా దోషమే అంటున్నారు. ఆగ్నేయ భాగంలో వాస్తు దోషం ఉంటే అది ఎంత గొప్ప వారైనా సర్వనాశనం చేసి, భవిష్యత్తులో ఎందుకు పనికి రాకుండా చేస్తుందని, బ్రతికుండగానే నరకం చూపిస్తుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆగ్నేయ భాగంలో ఎటువంటి వాస్తు దోషములున్నా వెంటనే వాటిని సరి చేసుకోవాలని సూచిస్తున్నారు.

తూర్పు వీధి దక్షిణం వీధి గల గృహము ఆగ్నేయ గృహం అంటారు. ఆగ్నేయ గృహంలో నివసించేవారికి సత్ఫలితాల కంటే దుష్ఫలితాలు ఎక్కువగా ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. మిగతా అన్ని గృహాల కంటే ఆగ్నేయ గృహం తక్కువ వాస్తు బలాన్ని కలిగి ఉంటుందని చెబుతారు.

ఆగ్నేయ గృహం అయితే అన్నీ కష్టాలే.. మగపిల్లలపై తీవ్ర ప్రభావం

ఆగ్నేయ గృహం అయితే అన్నీ కష్టాలే.. మగపిల్లలపై తీవ్ర ప్రభావం

ఇక ఆగ్నేయ గృహ ప్రభావం ఇంట్లో ఉన్న ఆడపిల్లలపై తప్ప మిగిలిన అందరిపై ఉంటుంది. ఒకవేళ ఆగ్నేయ దోషం తోపాటు ఉత్తరం, వాయువ్య దోషమున్నచో ఆడ పిల్లలపై కూడా ఆగ్నేయ దోషం ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లోని మగపిల్లలపై దీని ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఇక ఆ దుష్ఫలితాలలో కొన్నిటిని చూసినట్లయితే ఆగ్నేయ భాగంలో వాస్తు దోషాలు ఉంటే కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది అని, అప్పుల పాలవుతారని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఆగ్నేయ వాస్తు దోషం ఫలితం : చదువురాదు, ఇల్లు వదిలి జులాయిలుగా మగపిల్లలు మారతారు

ఆగ్నేయ వాస్తు దోషం ఫలితం : చదువురాదు, ఇల్లు వదిలి జులాయిలుగా మగపిల్లలు మారతారు

మగ పిల్లలు ఇల్లు వదిలి పారిపోతారు అని, సహవాస దోషాలు ఎక్కువై ఉన్న డబ్బంతా దుబారా ఖర్చు చేసి చెడ్డ పేరు తెచ్చుకుంటారని చెప్పబడింది. ఆగ్నేయ భాగంలో వాస్తు దోషాలు ఉంటే పిల్లలకు సరిగా చదువు రాదని, కాపీలు కొట్టి పట్టుబడతారని, టీచర్లతో తిట్లు తింటారని, అవమానం పాలవుతారని సూచించబడింది. స్కూళ్లు, కళాశాలలలో ఇతర విద్యార్థులతో గొడవలు పెట్టుకోవడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం, దుర్వ్యసనాలకు లోనవడం జరుగుతుందని సూచించబడింది.

ఆగ్నేయం వాస్తు దోషం తో రక్తపాతాలకు ఛాన్స్

ఆగ్నేయం వాస్తు దోషం తో రక్తపాతాలకు ఛాన్స్

ఇక చిన్నవయసులోనే స్త్రీలపై వ్యామోహాన్ని పెంచుకోవడం, తల్లిదండ్రుల పైనే ఎదురుదాడికి దిగడం, టీచర్ల పైన దాడులకు పాల్పడటం వంటి దారుణమైన పనులకు కూడా పిల్లలు ఒడిగడతారని వాస్తు శాస్త్రం పేర్కొంది. దొంగతనాలకు, దోపిడీలకు వెనకాడరు. ఆగ్నేయంలో వాస్తు దోషం ఉంటే చిన్నచిన్న వ్యవహారాలు సైతం, పెద్ద ఘర్షణలు గా మారి రక్తపాతం కూడా జరుగుతుందని సూచించబడింది.

English summary
Vastu Doshas in the South East should be corrected immediately. It is said that if the south-east is higher than the south-west if there are silos or a gate, it is bad. Vastu Shastra says that If you don't fix it, everything will be destroyed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X