vastu tips: ఈ పనులు చేస్తే మీకు తిరుగులేని రాజయోగం; ఊహించని లక్ష్మీ కటాక్షం!!
ఇంటి నిర్మాణానికి ఏ విధంగా అయితే వాస్తు నియమాలను పాటించాలో, ఇంట్లో పెట్టుకునే వస్తువులు కూడా వాస్తు నియమాలను పాటించాలని వాస్తు శాస్త్రం చెబుతున్న విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఐశ్వర్యవంతులుగా ఉండాలంటే, లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే కొన్ని నియమాలను పాటించాలని చెబుతున్నారు. చిన్న చిన్న జాగ్రత్తలే సంతోషంగా జీవించటానికి కారణం అవుతాయని చెప్తున్నారు.

ఉదయం నిద్రలేవగానే చూడాల్సింది ఇదే ..
ఇంట్లోని ప్రతికూల శక్తులను పారద్రోలి లక్ష్మీ కటాక్షం పొందాలంటే కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే లక్ష్మీ ఇంట్లో స్థిరంగా నివాసం ఉంటుంది. లక్ష్మీ దేవి కటాక్షం పొందాలంటే ఉదయం నిద్ర లేవగానే అరచేతిని చూసుకుని నాలుగైదు సార్లు అరచేతిని ముఖంపై తిప్పటం వల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందని కొందరు వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర లేవగానే ఎవరో ఒకరి ముఖం చూడటం కంటే మన అరచేతిని చూసుకోవటమే మంచిదని చెప్తున్నారు.

డబ్బులు ఉండే చోట ఈ వస్తువులు పెడితే ధనలాభం
అలాగే ఇంట్లో డబ్బు భద్రపరచే చోట కొన్ని అక్షతలు, 4 లక్ష్మీ గవ్వలు, నాలుగు సూరీడు కాయలు, నాలుగు చిన్న ఆకుపచ్చ గాజులు, శ్రీ సూక్తం చదివి పెట్టడం చేస్తే శుభ ఫలితాలుంటాయని చెబుతున్నారు. చేతిలో డబ్బులు పుష్కలంగా వచ్చిన సమయంలో, మీకు వచ్చిన లాభంలో 10 శాతం దానధర్మాలకు కేటాయించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు. డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్న సమయంలో కుల దైవానికి మొక్కలు చెల్లించడం వల్ల కొంత ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు.

శనివారం ఈ పనులు చెయ్యండి... కలిసొస్తుంది
అంతేకాదు వీలైనంత వరకూ చిన్న పిల్లలకు స్వీట్లు, చాక్లెట్లు పంచడం కూడా ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించి, లక్ష్మీ కటాక్షం కలగడానికి కారణం అవుతుందని చెబుతున్నారు. ఉదయం నిద్ర లేవగానే పసుపు, ఆకుపచ్చ రంగు కలిగిన ఏదైనా వస్తువులు చూస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెబుతున్నారు. రాజయోగం కలగాలంటే ప్రతి శనివారం ఇంట్లో ఉన్న పగిలిన, విరిగిపోయిన వస్తువులు పారేయాలని సూచిస్తున్నారు. శనివారం పూట ఇంట్లో బూజు దులుపితే ఇంట్లోని ప్రతికూల శక్తి పారిపోతుందని చెప్తున్నారు.

అమ్మవారి పూజ వేళ ఇలా చెయ్యండి..
అమ్మవారి దగ్గర శుక్రవారం ఒక లవంగాన్ని ఉంచడం వల్ల లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు. గృహిణిలు కంటతడి పెట్టకుండా ఉన్న ఇంట్లో కూడా అదే ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతున్నారు. ఇక ప్రతి రోజు పూజ చేసే సమయంలో శ్రీసూక్తం తప్పనిసరిగా చదవాలని, శుక్రవారం, శనివారం పూజలలో శ్రీ సూక్తం చదవడం మరిచిపోవద్దని సూచిస్తున్నారు. ఇక పూజ గదిలో ఏకాక్షి కొబ్బరికాయ ఉంచడం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

జేబులో ఇవి పెట్టుకోండి.. పర్సులు ఇలా ఉంటే మంచిది
ముత్తయిదువులు ఎరుపు లేదా ఆకుపచ్చ గాజులు ధరిస్తే అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు. ఇక జేబులో 2 లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, సూరీడు కాయలు ఉంచడం ధనప్రాప్తి కలిగిస్తుందని చెబుతున్నారు. మగవాళ్ళు ఉపయోగించే పర్సులు ఎరుపు రంగులో ఉంటే మంచిదని సూచిస్తున్నారు. ఇక మహిళలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, అప్పుడే కలిసి వస్తుందని సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications