వాస్తు ప్రకారం రెండు గదుల మధ్య తలుపు ఉండొచ్చా?
వాస్తు ప్రకారం ఇల్లు కుట్టుకున్నప్పుడు గదులు ఇన్ని సంఖ్యలో ఉండాలని, తలుపులు ఇన్ని సంఖ్యలో ఉండాలని చాలామంది వాస్తు నిపుణులు చెబితే అందరూ పాటిస్తుంటారు. కొందరు సరిసంఖ్యలో, మరికొందరు బేసి సంఖ్యలో తలుపులు ఉండేలా చూసుకుంటారు. అయితే దాదాపు 98 శాతం మంది బేసి సంఖ్యనే అనుసరిస్తుంటారు. కొంతమందికి తూర్పువాకిలో ఇల్లుంటే వంటగదిని ఆనుకొని మరో గది కడతాడు. అప్పుడు ఆ రెండింటి మధ్య తలుపు పెట్టాలా? వద్దా? గదుల్లో మార్పేమైనా చేయాలా? అనే సందేహంతో ఉంటారు. అటువంటివాటికి సమాధానం తెలుసుకుందాం.
ఆగ్నేయంలో వంటగది ఉంటే మంచిది.
రెండు గదుల మధ్య తలుపు ఉంటే మంచిదే.
ఎటువంటి నష్టం కలగదు.
కొత్తగా కట్టిన గదికి వాయువ్యంలో తలుపు వచ్చేలా చూసుకోవాలి.
దీనివల్ల మంచి ఫలితాలు పొందుతారు.

రెండు గదుల మధ్య తలుపు అనేది సరళ రేఖలో ఉండాలి.
గదికి మూలల్లో తలుపు పెట్టకూడదు.
గోడ నుంచి కొద్దిగా స్థలం వదిలి తలుపును అమర్చాలి.
తూర్పు, ఉత్తర గోడలకు తలుపులు ఉండాలి.
దీనివల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది.
నైరుతి దిశలో ఉన్న గదుల మధ్య మాత్రం చాలా తక్కువ తలుపులు ఉండాలి.
తూర్పు గోడకు ఈశాన్యం వైపు తలుపు పెట్టాలి.
ఉత్తరం గోడకు ఈశాన్యం వైపు తలుపు పెట్టాలి.
దక్షిణం గోడకు ఆగ్నేయం వైపు తలుపు పెట్టాలి.
పడమర గోడకు వాయువ్యం వైపు తలుపు పెట్టాలి.
తలుపు తీసినప్పుడు కిర్రు మనే శబ్దం రాకూడదు.
దీనివల్ల కుటుంబంలో ప్రశాంతత లోపిస్తుంది.
వీలున్నంతవరకు గదుల మధ్య రెండు రెక్కల తలుపు ఉంటే మంచిది.
ఇది లోపలికి తెరుచుకునేలా ఉండాలి.
వంటగదికి, టాయిలెట్ కు మధ్య నేరుగా తలుపు ఉండకూడదు.
ఇది అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
పూజ గది తలుపులు ఇతర గదుల తలుపులకు నేరుగా ఎదురుగా ఉండకుండా చూసుకోవాలి.












Click it and Unblock the Notifications