అరుదైన రాజయోగం... ఈ రాశులకు అఖండ ధనయోగం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో ఒక్కో గ్రహానిది ఒక్కో తీరు. వాటికి ఒక్కో మహిమ ఉంటుంది. నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశి, ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రానికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే సమయంలో అరుదైన రాజయోగాలు ఏర్పడి జాతకులను మహర్జాతకులుగా చేస్తాయి. ఈ క్రమంలోనే మూల త్రికోణ రాజయోగం ఏర్పడింది. దీనివల్ల కొన్ని రాశులవారు జీవితంలో ఎన్నడూ కళ్లచూడని సంపదను చూడబోతున్నారు. తులారాశిలో శుక్రుడు, కన్యారాశిలో బుధుడు, కుంభరాశిలో శనిదేవుడు ఉండటంతో వీరంతా కలిపి మూల త్రికోణ రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాయి. వీటితోపాటు శష రాజయోగం, భద్ర రాజయోగం, మాలవ్య రాజయోగాలు కూడా ఏర్పడుతున్నాయి. వీటివల్ల ఏ రాశివారు మంచి ప్రయోజనాలను పొందుతున్నారో తెలుసుకుందాం.

మీన రాశి
అన్నిరంగాల్లో విజయం సాధిస్తారు. జీవితంలో సంతోషాన్ని అనుభవిస్తారు. ఆదాయం పెరుగుతుంది. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనిలో మరింత చిత్తశుద్ధిగా ఉంటారు. ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతోపాటు పదోన్నతి ఉంటుంది. కుటుంబ సభ్యలు అన్యోన్యంగా ఉంటారు. పనిలో ప్రదర్శించే చిత్తశుద్ధి మిమ్మల్ని శిఖరాగ్రాలకు చేరుస్తుంది. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉంటారు. దాంపత్య జీవితంలో ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనివల్ల ఆర్థికంగా లాభం పొందుతారు.

venus and mercury and saturn brings rare rajayoga two zodiac signs will get more money and happy life

కన్యారాశి
గత కొంతకాలం అనుకుంటున్న పనిని ఈ సమయంలో ప్రారంభించడానికి మంచి అవకాశం. ఈ రాశివారు శనిదేవుడు, బుధుడు, శుక్రుడి ఆశీర్వాదం పొందుతారు. తెలివితేటలు పెరిగి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. విదేశాల నుంచి ధనలాభం ఉంది. పిల్లలకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. విద్యార్థులకు ఈ సమయం బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల అనురక్తి కలుగుతుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులు లేదంటే స్నేహితులతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహార యాత్రలకు వెళతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+