మార్చిలో శుక్రుడి అరుదైన కదలికలు.. ఈ రాశులు మట్టి పట్టుకున్నా వజ్రం అవుతుంది

నవగ్రహాల్లో అత్యంత శుభ ఫలితాలను కలిగించే మొదటి గ్రహం శుక్రుడు. వ్యక్తి జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉన్నాడా.. అతనికి తిరుగే ఉండదు. సంపదకు, విలాసవంతమైన జీవితానికి, అందానికి, ఐశ్వర్యానికి ప్రతీక శుక్రుడు. అటువంటి శుక్ర గ్రహం వచ్చే నెల 23వ తేదీన మీనరాశిలోకి ప్రవేశించబోతోంది. దీనివల్ల కొన్ని రాశులవారు అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు పొందనున్నారు. అంతేకాదు.. మంచి ఆరోగ్యంతోపాటు మంచి సంపాదనకు అవకాశాలు కూడా కల్పిస్తాడు. ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

ధనుస్సు రాశి
అదృష్టం బాగా కలిసివస్తుంది. దీనివల్ల సంపాదన విపరీతంగా పెరుగుతుంది. భవిష్యత్తులో మంచి రాబడినిచ్చేలా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక లాభాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులందరూ కలిసి తీర్థయాత్రలకు వెళతారు. కొంతకాలం నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు శుక్రుడిని పూజించాలి.

venus enter pisces from march 23rd three zodiac signs will get huge money

కుంభ రాశి
సమాజంలో హోదా పెరగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న పెండింగ్ పనులన్నీ ఈ సమయంలోనే పూర్తవుతాయి. అంతేకాదు.. వ్యాపారాల్లో వస్తున్న సమస్యలను అధిగమించి ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. అందరూ మనశ్శాంతిగా జీవితం గడుపుతారు. కుటుంబం నుంచి మద్దతు లభించి ఆత్మవిశ్వాసంతో, ఎంతో సమర్థతతో పనులు పూర్తిచేస్తారు.

మకర రాశి
ఏ పని తలపెట్టినా సులువుగా పూర్తవుతుంది. అంతేకాదు.. ప్రేమలో ఉన్నవారి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంబంధాలు బలపడతాయి. ఉద్యోగస్థులకు బాగుంది. వ్యాపారస్తులకు మంచి ఆర్డర్లు లభించి భారీ లాభార్జన ఉంది. ఆరోగ్యం విషయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారికి డబ్బులిచ్చే సమయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడిని దర్శించుకోవడంతోపాటు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శుక్రుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+