ఏడు రోజుల్లో ఈ రాశులపై కనక వర్షం కురుస్తోంది
వచ్చే నెల ఐదోతేదీ నుంచి ఎంతో పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది. ఈనెల 29వ తేదీ నుంచి ఆగస్టు నాలుగో తేదీ వరకు ఏడు రోజుల సమయం ఉంది. జులై నెలకు ఇదే చివరి వారం అవుతుంది. ఈ వారంలోనే కొన్ని గ్రహాలు రాశి సంచారం చేస్తుండటంతోపాటు శనిదేవుడు కొన్ని మార్పు చేర్పులు చేస్తున్నాడు. దీని ప్రభావం అన్ని రాశులవారిపై ఉంటున్నప్పటికీ కొన్ని రాశులవారిపై మాత్రం ప్రత్యేక ప్రభావం పడుతుంది. కొన్ని రాశులకు మంచి మంచి ప్రయోజనాలు కలుగుతుంటే, మరికొన్ని రాశులవారికి మాత్రం అశుభ పరిణామాలు ఎదురుకాబోతున్నాయి. ప్రధానంగా ఆర్థిక ప్రయోజనాలు పొందబోతున్న రాశుల వివరాలను తెలుసుకుందాం.
కుంభరాశి
కెరీర్ కు సంబంధించి ఈ వారం రోజుల్లో అతి పెద్ద విజయాన్ని నమోదు చేస్తారు. అంతేకాకుండా కొత్త కొత్త అవకాశాలు తలుపు తడతాయి. వీటిని సద్వినియోగం చేసుకుంటే జీవితం మరింత వెలుగులీనుతుంది. ధైర్యం, బలం పెరిగి ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తిచేస్తారు. వ్యాపారస్తులకు మంచి అవకాశాలు దక్కుతాయి. పెట్టుబడులు పెట్టడంపై దృష్టిసారిస్తారు.

తులారాశి
ఈ వారం రోజులు ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతోపాటు పనిచేసేచోట పై అధికారుల నుంచి మద్దతు లభించి అనుకున్న పనులు పూర్తిచేసి మంచి పేరు సంపాదిస్తారు. ఆర్థిక సమస్యలు చికాకు పెడుతున్నప్పటికీ వాటిని ఎదుర్కొనే మనోధైర్యం సొంతమవుతుంది.
మేష రాశి
కష్టపడి పనిచేసేవారికి ఈ వారం రోజులు బాగా కలిసివస్తాయి. ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది. అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడతారు. వ్యాపారస్తులకు ఆర్థికంగా లాభాలు కలగడంతోపాటు వారి పరిస్థితి బలోపేతమవుతుంది. ఏ పని అనుకున్నప్పటికీ అందులో అతి సులువుగా విజయం సాధిస్తారు. కెరీర్ పరంగా అద్భుతమైన విజయాల్ని నమోదు చేయబోతున్నారు.
వృశ్చిక రాశి
సమాజానికి మేలు చేసే పనులు చేస్తున్నవారికి ఈ వారం రోజులు అద్భుతంగా ఉంటాయి. స్నేహితుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించి మరిన్ని మంచి పనులు తలపెడతారు. కెరీర్ పరంగా విజయవంతం కావడంతోపాటు భౌతిక సుఖాలు కూడా దక్కుతాయి. ఆర్థికంగా పరిస్థితి పటిష్టంగా మారుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.












Click it and Unblock the Notifications