weekly horoscope: రాశిఫలాలు (ఆగస్టు 20 - 26)

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశిఫలాలకు నక్షత్రాల గమనం ఆధారంగా నిపుణులు అంచనా వేస్తుంటారు. ఈ వారం ఏ రాశివారికి బాగుంటుంది? ఏ రాశివారికి కలిసివస్తుంది? ఇంటా, బయట ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయి? అంతా సానుకూలమేనా? ఇబ్బందులేమైనా ఉన్నాయా? తదితరాలను రాశిచక్రాలను ఆధారంగా చేసుకొని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. ఈనెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి: ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మంచైనా, చెడైనా దాన్ని గురించి ఆలోచించడం అనవసంర. కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కార్యాన్ని సాధిస్తారు. వ్యాపారంపై శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలు లాభంగా మారతాయి. ఇష్టదేవతను స్మరిస్తుండాలి.

weekly horoscope from auguts 20th to 26th 2023

వృషభ రాశి: వ్యాపారంలో లాభాలున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సూర్యదోషం కనపడుతోంది. మొహమాటంవల్ల శ్రమ ఎక్కువవుతుంది. సమయస్ఫూర్తితో మంచి ఫలితాలు సాధిస్తారు. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకోవాలి. సూర్యుడిని ఆరాధించడం మేలు చేస్తుంది.

మిథునరాశి: ఉద్యోగంలో మంచి ఫలితాలను సాధిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు తీసుకునే నిర్ణయాలు నలుగురికి ఆదర్శంగా నిలుస్తాయి. పొరపాట్లు జరక్కుండా చూసుకోవాలి. ధర్మాన్ని వీడొద్దు. స్నేహితులు అండగా నిలబడతారు. విష్ణు సహస్రనామ స్మరణ శుభాన్ని కలిగిస్తుంది.

కర్కాటకరాశి: కొత్త ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. ధనలాభం ఉంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శత్రుదోషం తొలగిపోతుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఇష్టదేవతను స్మరించడంవల్ల శుభవార్తను వింటారు.

సింహరాశి: ప్రతి అడుగు ఆచితూచి వేస్తుండాలి. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోవాలి. గ్రహదోషం వల్ల విఘ్నాలు ఉన్నాయి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. పనులు వాయిదా వేయవద్దు. నవగ్రహ దేవతను స్మరించడంవల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

కన్యరాశి: ముఖ్యమైన పనులప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మనోబలంతోనే ఆటంకాలను అధిగమించాల్సి ఉంటుంది. ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతే ఏ నిర్ణయమైన తీసుకోవాలి. మీరు ధర్మంగా ఉంటే ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. శుక్రుడి వల్ల ఏకాదశంలో ధనయోగం ఉంది. ఇష్టదేవతను స్మరించడంవల్ల అంతా మంచి జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+