మహాలక్ష్మిని ధ్యానించాలి... ఈ రాశులవారు అనుకున్నది సాధిస్తారు
ఈ వారం ఏ రాశివారికి కలిసివస్తుంది? రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా అంతా సానుకూలమేనా? లేదంటే ప్రతికూలతలేమైనా ఉంటాయా? ఉంటే వాటిని ఎలా పరిష్కరించుకోవాలి? అనే విషయాలను జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈనెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి: సకాలంలో నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో మంచి ఫలితాలున్నాయి. భవిష్యత్తుపై దృష్టి సారించాలి. పనులు పూర్తవుతాయి. కలలో కూడా చెడును ఊహించవద్దు. మీ నిజాయితీయే మిమ్మల్ని రక్షిస్తుంది. ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. ఇష్టదైవాన్ని స్మరించడంవల్ల శుభవార్తను వింటారు.

వృషభరాశి: అడుగడుగునా ఆటంకాలుండటంతో వాటిని బుద్ధిబలంతో అధిగమించే ప్రయత్నం చేయాలి. దేనికీ ఆవేశం పనికిరాదు. తొందరపాటుతనంతో తీసుకునే నిర్ణయాలవల్ల ఇబ్బందులు పెరుగుతాయి. మిత్రుల సలహాలు మేలు చేస్తాయి. ఉత్సాహంగా పనిచేయాలి. వ్యాపారంలో బాగా కష్టపడాల్సి ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠించాలి.
మిథునరాశి: కాలం బాగుంది. మంచి ఫలితాలు ఎదురవుతాయి. కొత్తగా చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పదవీ లాభం కనపడుతోంది. శత్రువులు మిత్రులవుతారు. పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు. పెట్టుబడుల నుంచి లాభం వస్తుంది. వీరివల్ల కొందరికి మేలు కలుగుతుంది. న్యాయపరమైన విషయాల్లో విజయం ఉంది. లక్ష్మీదేవిని ధ్యానించాలి.
కర్కాటక రాశి: నిర్ణయాలు సరిగ్గా అమలుపరిస్తే ఆర్థికంగా లాభపడతారు. వ్యాపారం పలు మార్గాల్లో విస్తరిస్తుంది. గృహ, వాహన యోగాలున్నాయి. నైపుణ్యాలను పెంచుకోవాలి. ఉద్యోగంలో సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. మిత్రబలంతో పని పూర్తవుతుంది. ఇష్టదైవాన్ని స్మరించడంవల్ల మేలు కలుగుతుంది.
సింహ రాశి: సకాలంలో పనులు ప్రారంభించడంతోపాటు ఏ విషయంలోనూ వెనకడుగు వేయవద్దు. అంతఃకరణ శుద్ధితో తీసుకునే నిర్ణయం బలాన్నిస్తుంది. పనులు వాయిదా వేయొద్దు. లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంది. చంచలత్వం పనికిరాదు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు సానుకూల ఫలితాలనిస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించడంవల్ల శుభవార్తను వింటారు.
కన్యారాశి: దేనికోసం ప్రయత్నిస్తున్నారో దాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉన్నాయి. ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటాయి. భూమికి సంబంధించి లాభం కనపడుతోంది. వాహన యోగం ఉంది. కొత్త విషయాలను తెలుసుకుంటారు. మహాలక్ష్మీని ధ్యానించడం మంచిది.












Click it and Unblock the Notifications