ఈవారం ఈ రాశులకు అద్భుత యోగం ఉంది
జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు నిర్దేశిత సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచరించే క్రమంలో కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు కలిగితే మరికొన్ని రాశులవారికి అశుభ ఫలితాలు కలుగుతాయి. డిసెంబరు 17 నుంచి 23వ తేదీ వరకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా ఈ వారం ఎలా ఉండబోతోంది? మంచి ఫలితాలైతే పర్వాలేదు.. చెడు ఫలితాలుంటే వాటి నివారణకు ఏం చేయాలి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి : ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఏ పనికైనా పట్టుదల ఉండాలి. ఏ విషయంలో తొందర పనికిరాదు. సన్నిహితులిచ్చే సూచనలు బాగా పనిచేస్తాయి. వ్యాపారంలో విఘ్నాలు తొలగిపోతాయి. దేన్నిగురించి లోతుగా ఆలోచించొద్దు. ఇష్టదేవతను స్మరించడంవల్ల శుభం కలుగుతుంది.

వృషభరాశి : కాలం వ్యతిరేకంగా ఉంది. పనిలో ఏకాగ్రత పెంచాలి. కాలం వృథా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఎదుటివారితో మితంగా మాట్లాడటంవల్ల మేలు కలుగుతుంది. పెట్టుబడులు పెట్టకుండా ఉంటేనే మంచిది. విఘ్నాలను సమయస్ఫూర్తితో అధిగమించాలి. కొత్త ప్రయోగాలు వద్దు. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మేలు జరుగుతుంది.
మిథున రాశి : ఉద్యోగంలో మంచి స్థాయికి చేరుకుంటాడు. పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. ఓర్పు వహించాలి. పనులు సకాలంలో పూర్తిచేయాలి. ఏ నిర్ణయమైనా ఎంతో ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. చెడును కలలో కూడా ఊహించొద్దు. న్యాయం మీవైపే ఉంటుంది. ఇష్టదైవాన్ని స్మరించడంవల్ల శుభవార్తను వింటారు.
కర్కాటకరాశి : మంచి ఉద్యోగంలో విశేషమైన పేరు వస్తుంది. పదవీలాభం కనపడుతోంది. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపారంలో లాభాలున్నాయి. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలి. ధన ధాన్యాభివృద్ధి ఉంది. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. ఇష్టదైవాన్ని స్మరించడంవల్ల మంచి జరుగుతుంది.
సింహరాశి : అదృష్ట యోగం ఉంది. ఆత్మవిశ్వాసం తగ్గకూడదు. ఉద్యోగంలో మేలు కలుగుతుంది. నిజాయితీగా ఉండటంవల్ల పెద్దల నుంచి అభినందనలు అందుకుంటారు.
ఆర్థికంగా బాగుంది. ఏది మాట్లాడినా ఎంతో స్పష్టంగా ఉండాలి. వ్యాపారం కలిసివస్తుంది. ఆవేశం వద్దు. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు బలాన్నిస్తాయి. ఇష్టదైవాన్ని స్మరిస్తే మేలు కలుగుతుంది.
కన్యారాశి : వ్యాపార యోగం ఉంది. కృషికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. కీర్తిప్రతిష్టలు కలుగుతాయి. పెట్టుబడులు లాభాలనిస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో కోరుకున్నది సాధిస్తారు. గృహ, వాహన యోగం ఉంది. వస్తు, వస్త్ర ప్రాప్తి ఉంది. ఇష్టదైవాన్ని స్మరించడంవల్ల శుభవార్తను వింటారు.












Click it and Unblock the Notifications