వ్యాపారంలో లాభం ఉంది.. ఇష్టదైవాన్ని స్మరించాలి

ఒక నిర్దేశిత సమయంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచరిస్తుంటాయి. ఇలా సంచరించే క్రమంలో కొన్ని రాశులవారికి మంచి ఫలితాలు కలిగితే మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఈనెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా ఎలా ఉంది? ప్రతికూలతలు ఉంటే ఏం చేయాలి? అనే విషయాలను తెలుసుకుందాం.

మేషరాశి
సకాలంలో పనులు పూర్తిచేసి ప్రశంసలందుకుంటారు. ముఖ్య కార్యాల్లో జాగ్రత్తగా ఉండాలి. తీసుకునే నిర్ణయాలు మనోబలంతో తీసుకోవాలి. జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాలి.. ఎందుకంటే ఆర్థికంగా మిశ్రమంగా ఉంది. ఇష్టదైవాన్ని స్మరించడంవల్ల ప్రశాంతత లభిస్తుంది.

weekly horoscope from december 24th to 30th

మిథున రాశి
గ్రహబలం తక్కువగా ఉంది.. తొందర పనికిరాదు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. సహనంతో లక్ష్యాన్ని పూర్తిచేయాలి. ఏ మాటలను, ఎవరి మాటలను మనసుకు పట్టించుకోవద్దు. లోతైన ఆలోచనలు అనవసరం. వ్యాపారంలో నష్టాలను నివారించాలి. ఇష్టదైవాన్ని స్మరించడంవల్ల శుభం జరుగుతుంది.

వృషభ రాశి
ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. అమలు చేసే విషయంలోను అంతే ధైర్యంగా అమలు చేయాలి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. భూమి, వాహన యోగాలున్నాయి. ఇంట్లో శుభాలున్నాయి. బంధుమిత్రులతో ఆనందిస్తారు. ఇష్టదైవాన్ని స్మరించాలి.

కర్కాటక రాశి
ఇబ్బందులు తొలగుతాయి. శత్రువులు మిత్రులవుతారు. మనసులోని కోరిక నెరవేరుతుంది. వ్యాపారంలో లాభాలున్నాయి. ఇష్టదేవతను స్మరించడంవల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది.

సింహ రాశి
ఉద్యోగ బాధ్యతలను సకాలంలో నిర్వర్తిస్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి లాభపడతారు. వ్యాపారంలో మేలు కలుగుతుంది. సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సూర్యనారాయణమూర్తిని స్మరించడంవల్ల శుభం జరుగుతుంది.

కన్యారాశి
ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. మనోబలంతో నిర్ణయాలు తీసుకోవడంతోపాటు అంతే బలంతో వాటిని అమలు చేయాలి. కోరుకున్నది నెరవేరుతుంది. ఆపద నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి. పనుల్ని వాయిదా వేయడం మంచిదికాదు. కలహాలకు దూరంగా ఉండాలి. శివనామస్మరణ శక్తినిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+