రాశిఫలాలు: మహాలక్ష్మిని దర్శించండి... అదృష్టం వరిస్తుంది

ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసొస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబ అంశాల్లో ఎటువంటి మార్పులు ఉంటాయి? అంతా సానుకూలమేనా? లేదంటే ఏవైనా ఇబ్బందులు ఉంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా తెలుసుకోవచ్చు. డిసెంబరు 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి: పనులు సకాలంలో ప్రారంభించి పూర్తిచేయాలి. ఉద్యోగంలో మంచి ఫలితాలు పొందుతారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు శాంతంగా ఉండాలి. దగ్గరివారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఆపద నుంచి బయటపడతారు. పూర్వపుణ్యం కాపాడుతుంది. వ్యాపారంలో జాగ్రత్తగా ఉ:డాలి. ఇష్టదైవాన్ని స్మరించడంవల్ల శుభవార్తను వింటారు.

weekly horoscope from december 3rd to 9th 2023

వృషభరాశి: మనోబలంతో ముందుకెళ్లాలి. అడుగడుగునా ఆటంకాలుంటాయి.. అయినా పనులు వాయిదా వేయొద్దు. లక్ష్యానికి దగ్గరలో ఉన్నారు. నలుగురిని కలుపుకుపోవాలి. చెడు ఊహించవద్ద. ఒంటరి నిర్ణయాలు పనికిరావు, సూర్యనారాయణమూర్తిని స్మరించడంవల్ల అనుకున్నది సాధిస్తారు.

మిథునరాశి: సమయం బాగుంది.. విజయాలు సాధిస్తారు. దీన్ని సద్వినియోగం చేసుకోవడంవల్ల అదృష్టవంతులు అవుతారు. మంచి భవిష్యత్తు కనపడుతోంది. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు సక్సెస్ అవుతాయి. ఆర్థిక యోగం ఉంది. లక్ష్మీదేవిని ధ్యానించడంవల్ల మేలు కలుగుతుంది.

కర్కాటకరాశి: వ్యాపారంలో లాభాలున్నాయి. సంపాదన పెరుగుతుంది. దాచుకున్న ధనం వృద్ధి చెందుతుంది. గృహ వాహన యోగాలున్నాయి. భవిష్యత్తు బాగుంది. లక్ష్యంపై దృష్టిపెట్టాలి. మిత్రులతో కలిసి చేసే పనులు మంచి ఫలితాన్నిస్తాయి. సూర్యనారాయణమూర్తిని స్మరించాలి.

సింహరాశి: అదృష్టం తోడుంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అధికారులతో సామరస్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అనుమానంతో ఏపనినీ తలపెట్టవద్దు. దేనికీ తొందర పనికిరాదు. వ్యాపారంలో ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది. ఇష్టదైవాన్ని స్మరించాలి.

కన్యరాశి: విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడుల నుంచి లాభం తీసుకుంటారు. మహాలక్ష్మీదేవిని దర్శించడంవల్ల అదృష్టం వరిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+