ఈ వారంలో ఈ రాశులవారే మహర్జాతకులు.. లక్ష్మీదేవి అనుగ్రహం
గ్రహాలు, నక్షత్రాల గమంన ఆధారంగా జ్యోతిష్య పండితులు రాశిఫలాలను తెలియజేస్తుంటారు. ఇతరత్రా అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. వీటిద్వారా ఏరోజు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో విశ్లేషిస్తుంటారు. అలాగే ఈనెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రాశిఫలాలు ఎలా ఉన్నాయో చెబుతున్నారు. రాశులవారీగా వాటి వివరాలను తెలుసుకుందాం.
మేష రాశి:
ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల్లో మంచి వ్యక్తులతో పరిచయం జరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. శ్రమతోనే పనులు పూర్తవుతాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

వృషభ రాశి:
ఈ వారమంతా ప్రశాంతంగా గడుస్తుంది. ఆస్తి వివాదం ఇబ్బంది పెడుతుంది. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఎవరికీ డబ్బు ఇవ్వడం కానీ, ఎవరినుంచి తీసుకోవడం కానీ శ్రేయస్కరం అవదు.
మిథున రాశి:
ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. దూరపు బంధువుల వల్ల పెళ్లి కుదురుతుంది. పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. బంధువులతో మాట పట్టింపులు వస్తాయి. ఉద్యోగంలో శుభవార్తను వింటారు. ఇష్టమైన దేవుళ్లను సందర్శిస్తారు.
కర్కాటక రాశి:
ఉద్యోగాల్లో మార్పులు ఉన్నాయి. ఆస్తి వివాదంలో రాజీమార్గానికి వస్తారు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కెరీర్ పరంగా జీవిత భాగస్వామి నుంచి మంచి పురోగతి ఉంటుంది. వ్యక్తిగత పనులు నిదానంగా పూర్తవుతాయి.
సింహ రాశి:
ఆర్థిక పరిస్థితి మెరుగపడుతుంది. ముఖ్యమైన పనులు చేసేటప్పుడు సలహా తీసుకోవాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం ఉంది. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి.
కన్య రాశి:
ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఎంతో ముఖ్యమైన పనులు పూర్తిచేయడానికి ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనవ్వాల్సి ఉంటుంది. కొత్త వాహనం సమకూరుతుంది. మిత్రులవల్ల ఆర్థిక నష్టం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మడం మంచిదికాదు.












Click it and Unblock the Notifications