వారఫలాలు: అనుకున్న మార్గంలోనే ముందుకెళ్లాలి.. ధర్మదేవత రక్షిస్తుంది

జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశులు, 27 నక్షత్రాల గురించి పూర్తిగా చెబుతారు. నిర్దిష్ట సమయం తర్వాత గ్రహాలు తమ రాశులను మారుస్తుంటాయి. ఈనెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు వివిధ రాశులవారి రాశిఫలాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

మేషరాశి : కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారం కలిసివస్తుంది. లాభాలుంటాయి. ఉద్యోగస్తులు విజయం సాధిస్తారు. కోరుకున్న సంకల్పం నెరవేరుతుంది. అయితే అనవసరంగా ఒత్తిడికి గురికావొద్దు. పాజిటివ్ దృక్పథంతో ఉండాలి. ఎవరు ఏది మాట్లాడినా లైట్ తీసుకోవాలి. మనసుకు పట్టించుకోవద్దు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆవేశం అసలు పనికిరాదు. ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండండి. శుభవార్త వింటారు.

horoscope1-1690097030.jpg -Properties

వృషభరాశి : ఆర్థికంగా వృద్ధి సాధిస్తారు. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు బంగారు బాట వేస్తాయి. చేస్తున్న పనుల్లో విజయం సాధిస్తారు. అనుకున్న పనిని పూర్తిచేయడానికి ఇది అనుకూలమైన కాలం. ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. ఇతరులపై అసలు ఆధారపడొద్దు. ఇష్టదైవాన్ని స్మరిస్తుంటే శక్తి వస్తుంది.

మిథునరాశి : మొదటి నుంచి దేనికోసం ప్రయత్నిస్తున్నారో దాన్ని సాధిస్తారు. వ్యాపారంలో రాణింపు ఉంది. శుభయోగాలున్నాయి. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు రచించుకోవడానికి ఇదే మంచి సమయం. మనసు చంచలత్వం లేకుండా మనోబలంతో ముందుకు వెళ్లాలి. దైవబలం కాపాడుతుంది. ఉద్యోగస్తులకు ప్రశంసలు దక్కుతాయి. మీకు ఆత్మీయులైనవారి సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి. సూర్య నమస్కారం శక్తిని అందిస్తుంది.

కర్కాటకరాశి : కంగారు పడకుండా ప్రశాంతంగా ఆలోచించడంద్వారా ఒత్తిడిని అధిగమించగలరు. పాజిటివ్ ఆలోచనలు కలిగివుండాలి. స్పష్టమైన నిర్ణయంతోనే లక్ష్యాన్ని చేరుకుంటారు. కలలో కూడా చెడును ఆలోచించవద్దు. ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. గతంలో ఎదుర్కొన్న అనుభవంతో ప్రస్తుతం వచ్చే ఇబ్బందులను అధిగమించాలి. శివుడిని ధ్యానించడంవల్ల మనోబలం పెరుగుతుంది.

సింహరాశి : అదృష్టయోగం ఉంది. కష్టపడినదానికి తగ్గట్లుగా ప్రతిఫలం వస్తుంది. సాచివేత చేయకుండా సకాలంలో పనులను పూర్తిచేయడంవల్ల మాత్రమే విజయం సాధిస్తారు. ముఖ్యమైన పనుల్లో ఎంతో అప్రమత్తత అవసరం. ఏ చిన్న పొరపాటు జరిగినా నష్టం భారీగా ఉంటుంది. ఆంజనేయస్వామిని స్మరిస్తుండాలి. అనుకున్న పని విజయవంతమవుతుంది.

కన్యారాశి : సగంలోనే పనుల్ని ఆపొద్దు. అనుకున్న మార్గంలోనే ముందుకు వెళ్లాలి. ధర్మదేవత రక్షిస్తుంది. సందర్భానుసారంగా వ్యవహరించాలి. మిత్రబలం పెరుగుతుంది. మధ్యలో నిర్ణయాలు మార్చొద్దు. స్థిరచరాస్తులు వృద్ధి చెందుతాయి. ఇష్టదేవతను స్మరిస్తుండాలి.. శాంతి లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+