జులై 9 నుంచి 15వరకు రాశుల వారఫలాలు

జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశులు, 27 నక్షత్రాల గురించి పూర్తిగా చెబుతారు. నిర్దిష్ట సమయం తర్వాత గ్రహాలు తమ రాశులను మారుస్తుంటాయి. ఈనెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాశులవారీగా ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేష రాశి: ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. పనిచేసేటప్పుడు ఉత్సాహం అవసరం. సంకల్పం దృఢంగా ఉండటతోపాటు తగిన కార్యాచరణ కూడా ఉండాలి. భూమి, వాహన యోగాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. గురు గ్రహ శ్లోకం చదువుకోవాలి.

weekly horoscope from july 9 to july 15th

వృషభరాశి: ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు కదలాలి. కార్యసిద్ధి లభిస్తుంది. ఏ పనిచేసినా విజయమే ధ్యేయంగా పనిచేయాలి. పనులు వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడే పూర్తిచేస్తుండాలి. అవసరాలకు నగదు అందుతుంది. గతంలో పెట్టిన పెట్టబడులు కలిసివస్తాయి. ఇష్టదేవతను ధ్యానించాలి. దీనివల్ల శక్తి వస్తుంది.

మిథున రాశి: ఇది అనుకూలమైన సమయం. వ్యాపారంలో శుభయోగాలున్నాయి. చిన్న చిన్న ప్రయత్నాలతోనే భారీ లాభం ఆర్జిస్తారు. ధైర్యంగా ధర్మమార్గంలో ముందుకు సాగాలి. ఎటువంటి ఆటంకాలనైనా తట్టుకుంటారు. మానసికంగా ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. అనుకున్న ఆశయం తీరేవరకు శ్రమిస్తూనే ఉండాలి. లక్ష్మీదేవిని ధ్యానించాలి. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది.

కర్కాటక రాశి: ధనయోగాన్ని సూచిస్తోంది. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలను గతంలో ఎదుర్కొన్న అనుభవంతోనే పరిష్కరించాలి. సమయం వ్యతిరేకంగా ఉంది. చిన్న పొరపాటు జరిగినా సమస్య తీవ్రంగా మారుతుంది. పట్టువిడుపులతో ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఏ పనిచేసినా ఇంట్లోవారికి చెప్పాలి. నవగ్రహ శ్లోకాలు పఠించాలి.

సింహ రాశి: బాధ్యతగా చేసే పనుల్లో విజయం లభిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోను పనులను వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు పూర్తిచేసే ప్రయత్నం చేస్తుండాలి. వ్యాపారస్తులకు బాగుంటుంది. స్థిరచరాస్తులు అభివృద్ధి చెందుతాయి. విష్ణునామస్మరణ చేయాలి.

కన్యా రాశి: సకాలంలో పనులు పూర్తిచేయడంవల్ల ఎదురుచూస్తున్న విజయం చేతికందుతుంది. ఉద్యోగంలో క్రమంగా మంచి స్థితికి చేరుకుంటారు. అద్భుతమైన శుభయోగాలు కనపడుతున్నాయి. ఎవరి మాటలను పట్టించుకోకుండా కేవలం లక్ష్యంపైనే దృష్టి నిలపాలి. అభీష్ట సిద్ధి కనపడుతోంది. ఇష్టదైవాన్ని స్మరించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+