వారఫలాలు: విశేషమైన ధనలాభాలున్నాయి.. ఇష్టదైవాన్ని స్మరించండి

వేద జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి నిర్దేశిత సమయంలో సంచరిస్తుంటాయి. ఇలా సంచరించే సమయంలో ఆయా రాశిచక్రాల జాతకులకు శుభ ఫలితాలతోపాటు అశుభ ఫలితాలు కూడా కలుగుతుంటాయి. అక్టోబరు 1వ తేదీ నుంచి అక్టోబరు 7వ తేదీ వరకు కుటుంబ పరంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎలా ఉంటుంది? అంతా సానుకూలమేనా? లేదంటే ఇబ్బందులంటే పరిష్కారాలేంటి? అనే విషయాలను రాశులవారీగా తెలుసుకుందాం.

మేషరాశి : అదృష్టం తోడుంటుంది. మంచి సమయం ఇది. ఉద్యోగంలో గుర్తింపు ఉంది. పనిచేసేచోట నైపుణ్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. శుక్రబలంతో ఆర్థిక వృద్ధి ఉంటుంది. ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి. లక్ష్మీధ్యానం శుభాలను చేకూరుస్తుంది.

weekly horoscope from october 1st to 7th

వృషభరాశి : అద్భుతమైన వ్యాపార యోగం ఉంది. స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగాలి. ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకోవాలి. పనులు వాయిదా వేయకూడదు. కుటుంబ సభ్యుల సలహాలు మంచి ఫలితాన్నిస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించాలి.

మిథునరాశి : ఉద్యోగంలో, వ్యాపారంలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగంలో ఉన్న అవరోధాలన్నీ తొలగుతాయి. విశేషమైన ధనలాభాలున్నాయి. చేసే పని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేయాలి. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఇష్టదైవాన్ని దర్శించాలి.

కర్కాటక రాశి : అదృష్టం వరిస్తుంది. కృషికి తగ్గ ఫలితాలున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ఎటుచూసినా విజయం కనిపిస్తోంది. కుటుంబ సభ్యుల సహకారంతో బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుంది. మహాలక్ష్మీదేవిని స్మరించాలి.

సింహరాశి : నిరుత్సాహం పనికిరాదు. ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. జీవితంలో ఈ స్థాయి వరకు రాగలిగారంటే అందులో మీ కృషి ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనోబలం లభిస్తుంది. పనిచేసేచోట ప్రశంసలందుకుంటారు. నవగ్రహ శ్లోకాలు పఠించాలి.

కన్యారాశి : ధనలాభం ఉంది. బాధ్యతగా పనిచేయాలి. ఆర్థికంగా కలిసివస్తుంది. కర్తవ్యాలను సకాలంలో నిర్వర్తించడంద్వారా ఆటంకాలు తొలగుతాయి. సత్యం, మానవత్వం మిమ్మల్ని కాపాడతాయి. బుద్ధి బలంతో లక్ష్యాన్ని చేరుకోవాలి. గ్రహాల అనుకూలత తక్కువగా ఉంది. నవగ్రహ శ్లోకాలు పఠించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+