అక్టోబరు 8 నుంచి 14 వరకు రాశిఫలాలు
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచరిస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని శుభ ఫలితాలతోపాటు కొన్ని అశుభ ఫలితాలను కూడా ఇస్తుంటాయి. అక్టోబరు 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వివిధ రాశులవారికి సామాజికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా ఎలా ఉంటుంది? సానుకూల ఫలితాలు లేక ఇబ్బందులు ఎదురవుతుంటే వాటిని ఎలా పరిష్కరించాలి? తదితర విషయాలను రాశిచక్రం ఆధారంగా పండితులు తెలియజేస్తున్నారు. రాశులవారీగా వారఫలాలను తెలుసుకుందాం.
మేషరాశి : ఉద్యోగంలో మంచి ఫలితాలను పొందుతారు. అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపార రీత్యా మంచి భవిష్యత్తు కనపడుతోంది. కలహాలకు దూరంగా ఉండటంతోపాటు అవసరాలకు సరిపడా నైపుణ్యాలను పెంచుకోవాలి. ఇష్టదేవతను స్మరిస్తే మంచిది.

వృషభ రాశి : నిబద్ధత పనిచేస్తే ఉద్యోగంలో మంచి ఫలితాలున్నాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో అప్రమత్తత అవసరం. అవసరం లేని పనులు చేయొద్దు. బంధు మిత్రుల సలహాలు పనిచేస్తాయి. విష్ణు సహస్రనామం చదువుకోవాలి. ఇంట్లో శుభాలున్నాయి.
మిథున రాశి : కొత్తగా చేపట్టే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పనులు సకాలంలో ధైర్యంగా చేయాలి. స్నేహితుల సహకారంతో మంచి భవిష్యత్తు పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. సూర్యనారాయణమూర్తిని స్మరించాలి.
కర్కాటక రాశి : ఉద్యోగంలో సకాలంలో పనులు పూర్తిచేయడం వల్ల పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. భూమి, వాహన యోగాలున్నాయి. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. పట్టుదలతో చేసే పనులు విజయవంతమవుతాయి. ఇష్టదైవాన్ని దర్శించాలి.
సింహ రాశి : వ్యాపార యోగం కనపడుతోంది. తెలివితేటలతో రాణిస్తారు. బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. భూమి, గృ, వాహన యోగాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించాలి. గొప్ప విజయం ఉంది.
కన్యరాశి : చేపట్టే పనులను మనోబలంతో చేయాలి. ప్రతి పనికి అవసరమైన ప్రణాళికలు రచించుకోవాలి. ధైర్యసాహసాలు అవసరమవుతాయి. ఏ నిర్ణయం తీసుకునేముందైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోవాలి. ఏ విషయాన్ని మనసులోకి పట్టించుకోవద్దు. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది.












Click it and Unblock the Notifications