వారఫలాలు: ధర్మమార్గంలో నడవండి.. లాభాలు గడిస్తారు
గ్రహాలు నిర్దిష్ట వ్యవధిలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచరిస్తుంటాయి. ఇలా సంచరించే క్రమంలోనే కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు, మరికొన్ని రాశులవారికి అశుభ ఫలితాలు ఏర్పడతాయి. ఈ వారం ఏ రాశివారికి బాగుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబ అంశాల్లో ఎటువంటి ఫలితాలు ఎదురు కానున్నాయి? సానుకూలంగానే ఉంటుందా? లేదంటే ప్రతికూలత ఎదురవుతుందా? అలా ఎదురైతే వాటిని ఎలా పరిష్కరించుకోవాలి? అనే అంశాలను జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాశిచక్ర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేష రాశి: శుభ యోగాలున్నాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి మిత్రుల సూచనలు పనిచేస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించాలి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.

వృషభరాశి: వ్యాపార యోగం చాలా బాగుంది. అనుకున్న విధంగానే పనులు ప్రారంభించాలి. ఆర్థిక పరిస్థితి బాగుంది. మధ్యలో పనులు మార్చొద్దు. సూర్యదోషం ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబ సభ్యులిచ్చే సూచనలు ఫలిస్తాయి. ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచిది.
మిథున రాశి: లాభాలున్నాయి. ఇది అదృష్టకాలం. ఉద్యోగంలో ప్రశంసలు లభిస్తాయి. జీవితాశయాలపై దృష్టి నిలపాలి. వాహన, గృహ యోగాలున్నాయి. లక్ష్మీధ్యానం శుభప్రదం. ఇతరులపై ఆధారపడొద్దు.
కర్కాటకరాశి: పనుల విషయంలో అశ్రద్ధ పనికిరాదు. కాలం అనుకూలంగా ఉంది. విజయం సాధిస్తారు. లాభాలను గడిస్తారు. పెట్టుబడులు లాభాలనిస్తాయి. ధర్మమార్గంలో ప్రయత్నాలు ఉండాలి. ఉద్యోగంలో శ్రద్ధ అవసరం. సూర్యనారాయణమూర్తిని స్మరించాలి.
సింహరాశి: ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఏకాగ్రతతో పనులు చేయాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. మాటల్లో స్పష్టత ఉండాలి. నమ్మకమే ముందుకు నడిపిస్తుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సూర్యుడి ఆరాధన మంచి చేస్తుంది.
కన్యా రాశి: ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా వేయాలి. మనోబలం ఉండాలి. మొహమాటంవల్ల సమస్యలు రాకుండా చూసుకోవాలి. లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకోవాలి. వారం మధ్యలో ఆటంకాలున్నాయి. అనుకున్నది సాధిస్తారు. దగ్గరివారి సూచనలు పనిచేస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించాలి.












Click it and Unblock the Notifications