వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమ్మ ఆకులతో పలు ఉపయోగాలు..ఆరోగ్యానికి మంచివి..ఎలానో తెలుసుకోండి...!

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఆయుర్వేదంలో నిమ్మ ఆకులతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.. వేడి నీటిలో వేసి రాత్రి పడుకునే ముందు తాగితే మంచిది. సాధారణంగా నిమ్మకాయల వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కేవలం నిమ్మకాయలే కాకుండా వాటి ఆకులతో కూడా ఎన్నో ఉపయోగాలున్నాయి. వీటిలో ఐరన్ , క్యాల్షియం , విటమిన్ ఏ , విటమిన్ బి 1 , విటమిన్ సి , ప్లేవనాయిడ్స్ , రైబోఫ్లోవిన్ , సిట్రిక్ యాసిడ్ ఉంటాయి . నిమ్మకాలయ వల్ల ఉన్న ఉపయోగాలు ఆకులతో కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 పడుకునే ముందు నిమ్మ ఆకులు

పడుకునే ముందు నిమ్మ ఆకులు

వీటి వల్ల ఎలాంటి ఉపయోగాలుంటాయో తెలుసుకుందాం:- నీళ్లను వేడి చేసి అందులో కొన్ని నిమ్మ ఆకుల్ని వేసి ఆ నీటిని రాత్రి పడుకునే ముందు తాగాలి . ఇలా నెల రోజులు చేస్తే మైగ్రేన్ తలనొప్పి, అస్మా వంటివి తగ్గిపోతాయి. అయితే నీటిని మాత్రం మరిగించకూడదు. కేవలం వేడినీటితోనే నానబెట్టాలి, ఇ విషయాన్ని గమనించాలి.

మానసిక రుగ్మతలకు నిమ్మ ఆకులు

మానసిక రుగ్మతలకు నిమ్మ ఆకులు


మానసికంగా డిప్రెషన్‌కు గురయ్యేవారు నిమ్మ ఆకులను నలిపి, ఆ వాసన పీల్చుకుంటే ఒత్తిడి తగ్గడమే కాకుండా ఉత్సాహంగా ఉండేందు ఉపయోగపడతాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉన్నాయి. బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా వీటిని వాడుతుంటారు. నాలుగు తాజా నిమ్మ ఆకులను గ్లాసు వేడినీటిలో మూడు గంటలు నానబెట్టి తాగితే నిద్రలేమి సమస్య, గుండె దడ, నరాల బలహీనత వంటి సమస్యలు దూరమవుతాయి.

ముఖం మీద మచ్చలు మాయమయ్యేందుకు..

ముఖం మీద మచ్చలు మాయమయ్యేందుకు..

నిమ్మ ఆకులను పేస్టుగా చేసి దానికి కాస్తా తేనే కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం మీద ఉన్న మచ్చలు, మొటిమలను తగ్గిస్తాయి. నిమ్మ ఆకులను మెత్తగా నూరి పళ్లకు పట్టిస్తే నోటి దుర్వాసన పోతుంది. అంతేకాదు పళ్లల్లో ఉండే బ్యాక్టీరియాను నాశనం అయ్యేలా చేస్తుంది, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి . స్నానం చేసే నీటిలో నిమ్మ ఆకులను వేసుకుని స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. వీటిని హ్యాండ్ వాష్ లా ఉపయోగించుకోవచ్చు . ఆకులను నలిపి చేతులకు రాసుకుంటే బ్యాక్టరీయా నశిస్తుంది.

English summary
There are many medicinal uses in Lime tree leaves. Lime leaves contain Iron, calcium, vitamin A & C.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X