Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శకునం: బల్లి శరీరంలోని ఏ భాగాలపై పడితే ఏమవుతుంది?

బల్లి శరీరంలోని ఏ భాగంపై పడితే ఏమవుతుందనే శకునాలను మనం నమ్ముతూ వస్తున్నాం. జ్యోతిషంలో గౌలి పఠన శాస్త్రం దీని గురించి వివరిస్తుంది. గౌలి పంచాంగంలో శకునాల ప్రభావం గురించి వివరించారు.

మనిషి శరీరంలోని ఓ భాగంపై బల్లి పడిందనే విషయంపైనే కాకుండా ఏ ప్రాంతంలో, ఏ సమయంలో పడింనేది కూడా ముఖ్యం. కొన్నిసార్లు బల్లి మీద పడితే మంచి శకునంగానూ కొన్ని సార్లు అశుభంగానూ భావిస్తారు.

పురుషులకు, మహిళలకు తేడా..

పురుషులకు, మహిళలకు తేడా..

పురుషుడి శరీరంలోని కుడి భాగంపై బల్లి పడితే శుభం కలుగుతుందని, మహిళకు మాత్రం ఎడమ భాగంపై పడితే శుభాలు కలుగుతాయని చెబుతారు. అదే సమయంలో పురుషుడి ఎడమ భాగంపైన, స్త్రీ కుడి భాగంపై బల్లి పడితే అశుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. రాత్రిపూట బల్లి పడితే మాత్రం ఏ విధమైన ఫలితాలు ఉంవని చబుతారు.

పురుషుడికి ఇలా..

పురుషుడికి ఇలా..

బల్లి తలపై పడితే వివాదాలు ముసురుకుంటాయనే సంకేతం ఇచ్చినట్లు. తల పైభాగాన పడితే మరణ భయం. ముఖం మీద పడితే ఊహించని విధంగా సంపద వచ్చి పడుతుంది. ఎడమ కంటిపై పడితే శుభవార్త వింటారు. కుడి కంటి మీద పడితే మీరు చేపట్టిన పని కాదు. నుదుటి మీద పడితే ప్రేమికుల నుంచి దూరమవుతారు. పై పెదవి మీద పడితే తగువులు వస్తాయి. కింది పెదవి మీద పడితే త్వరలో ఆర్థిక లాభం చేకూరుతుంది. రెండు పెదవుల మీద పడితే ఒకరి మరణవార్త వింటారు.

పురుషుడికి ఇంకా ఇలా...

పురుషుడికి ఇంకా ఇలా...

నోటి మీద మీ ఆరోగ్యం నశిస్తుందని అర్థం. వీపు వెనక భాగంలో పడితే ఏదో విజయం గానీ ఫలితం గానీ లభిస్తుంది. కలలో బల్లి కనిపిస్తే ప్రభుత్వానికి సంబంధించిన భయం పట్టుకుంటుంది. మణికట్టుపై పడితే ఇంటి మరమ్మత్తు లేదా ప్రాజెక్టు విభజన జరుగుతుందని సంకేతం.

పురుషుడి విషయంలో ఇలా జరిగితే...

పురుషుడి విషయంలో ఇలా జరిగితే...

చేయి మీద బల్లి పడితే ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. వేళ్ల మీద పడితే పాత మిత్రులు కలుస్తారు. కుడి చేతి మీద పడితే కష్టాలు వస్తాయనే సంకేతం. ఎడమ చేతి మీద పడితే అవమానం జరుగుతుంది. తొడల మీద పడితే దుస్తులు పోగొట్టుకుంటారు. మీసాల మీద పడితే మీరు సంక్లిష్టమైన సమస్యలు ఎదుర్కుంటారని శకునం చెబుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+