సంక్రాంతి ఫలితాలు ఎలా ఉంటాయి?
ప్రతీ నెలలోని 14,15, 6 తేదీల మధ్యలో సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా మారడాన్ని సంక్రమణం అంటారు. ఏ రాశిలోకి మారుతాడో ఆ రాశి పేరుతో ఆ సంక్రమణాన్ని పిలుస్తారు. ఉదాహరణకు - ఏప్రిల్ నెలలో మేష సంక్రమణం జరుగుతుంది.
అదే విధంగా ప్రతి జనవరిలో మకరరాశిలోకి సూర్యుడు మారుతాడు కాబట్టి మకర సంక్రాంతి అంటారు. ఈ సంక్రాంతినాడే ఏం జరుగుతుంది? కాలంలోని రుతువుల మార్పు కనిపిస్తుంది. దేశం యొక్క స్థితిగతులు ప్రత్యేకంగా మారుతాయి.
భారతీయ తాత్విక అంశాలన్నీ నామరూపాత్మకంగా చూపిస్తారు. అలాగే ఒక్కో సంక్రాంతి ఫలితాలని ఒక్కో సంక్రాంతి పురుషునిగా చూపిస్తారు, ఆయా ఫలితాలకు ప్రతీకగా వాహన, ఆయుధాలు మొదలైనవి చూపిస్తారు.

14.1.2015 తేదీన వచ్చే సంక్రాంతి ఫలితాలు క్రింది విధంగా ఉంటాయి.
సంక్రాంతి పురుషుని పేరు మందాకిని ఫలం రాజుకు కీడు కుంకుమోదక స్నానం చేశాడు ఫలితం కొంత శుభం వచ్చిన తిథి (దశమి) నీల వస్త్రములు ధరించాడు ప్రజలకుభయం ఉంటుంది, లాక్షాగంధం పూసుకున్నాడు దుష్టస్త్రీలకు అశుభం జరుగుతుంది, జపాపుష్పం ధరించాడు ` గొడవలు పెరుగుతాయి.
గోమేధిక రత్నం ధరించాడు అనవసరాందోళణలు పెరుగుతాయి, సీసపారతలో అన్నం ఆహారిస్తున్నాడు, పాలు త్రాగుతున్నాడు ` వ్యక్తులకీర్తితగ్గుతుంది. రేగుపళ్లుతింటున్నాడు జంతువులకు సుఖంగా వుంటుంది,
ఏనుగు వాహనం,కోదండ ఆయుధం,బంగారంగొడుగు,ఆగ్నేయదిక్కుకి ప్రయాణం ఫలం, హాని కలుగుట, ప్రజలకు అశుభం పెరుగుతుంది,యద్ధాలసూచనలు, ఇతర దేశాల అసూయ పొందుతుంట.కొంత ధాన్యనష్టం జరగుతుంది,ధాన్యం విలువ పెరుగుతుంది,రోగాలు పెరుగుతాయి.
మంచి వర్షం కురుస్తుంది కొత్తవస్త్రాలు ధరించటం,దేవతాదర్శనంచేయటం,పంటలలో కొంతభాగం దానంచేయటం,బంధుమిత్రులతో కలసి వేడుకలు,పుణ్యకార్యాలు చేయటం,భోగిమంటలు,ఇంటిని ముగ్గులతో అలంకరించడం,మొదలైనవి పండగలో చేసే విశేష కార్యాలు,
సంక్రామతౌ యానిదత్తాని హవ్యకవ్యానిదాతృభి:।
తానినిత్యం దదాత్యర్క: పునర్జన్మని జన్మని॥ సంక్రాంతిన ఎవరు ఏవేవిదానంచేస్తారో,వారికి గ్రహరాజైన సూర్యుడు జన్మజన్మలైనా ఇవిఇస్తూనే ఉంటాడు.












Click it and Unblock the Notifications