బ్రహ్మరాత రాసిన రాత చెరపడం సాధ్యమా? పూజల ప్రయోజనం ఏమిటి?
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
లలాట లిఖితా రేఖా పరిమాష్టుం న శక్యతే '
హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి !!
నుదుట వ్రాసిన రాతలు చెరిపివేయడం బ్రహ్మ చేతకానీ, విష్ణువు చేతకానీ , శివుడి చేతకానీ ఎవరివల్లా కాదు .
విధిరేవ గరీయసి' పూర్వ కర్మలననుసరించి ఏది అనుభవించాలో నిర్దారింపబడి ఉంటుంది . దానిని విధి అంటారు. అది అనుభవించక తప్పదు .

ప్రారబ్ధం భోగతే నశ్యేత్
అనుభవించవలసినది ప్రారబ్ధం . అది అనుభవించడం వల్ల పోతుంది తప్ప మార్చలేవు .
వీటిని తొలగించలేనప్పుడు పూజలు పునస్కారాలు చేసి ప్రయోజనం ఏమిటి ?
ప్రారబ్ధం అనుభవించక తప్పదు అనేది సాధారణ నియమం మాత్రమే . తగిన సాధన చేసి వీటిని కూడా మార్చవచ్చు .
విద్యుత్ తీగ మీద చెయ్యి వేస్తే షాక్ కొడుతుంది . ఇది సామాన్య సూత్రం . కానీ చేతికి రబ్బరు తొడుగు కట్టుకొని పట్టుకుంటే షాక్ కొట్టదు .
అలాగే సాధన అనే కవచాన్ని పెట్టుకుంటే ప్రారబ్ధం కూడా తొలగించుకోవచ్చును .
' శుభాని నిరాచష్టే తనోతి శుభ సంతతిమ్'
భగవంతుని ధ్యానించినట్లయితే అశుభములు తొలగిపోయి శుభ పరంపరలు కలుగుతాయి .
అశుభం - ప్రారబ్ధ వశాత్తు పూర్వ కర్మలననుసరించి వచ్చే దుఃఖములు , తప్పుడు పనులు చేయడానికి ప్రేరణలు .
ప్రారబ్ధం అనుభవించక తప్పదు అని చతికిలపడిపోకూడదు .
*యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యత్ చ దుర్గమం !
తత్ సర్వం తపసా సాధ్యం తపోహి దురతిక్రమం !!
దేనిని మనం అసలు చేయలేం అనుకుంటామో దేనిని మనం పొందలేము అనుకుంటామో దేనిని సాధించలేము అనుకుంటామో అవన్నీ కూడా తపస్సు చేస్తే సాధ్యం అవుతుంది .
మానవుడు గతానికి తలచుకుంటూ ఏడుస్తూ కూర్చోకూడదు .
దుఃఖం ఎక్కువ ఉన్నప్పుడు తపస్సు శక్తిని పెంచుకోవాలి .
దేవతారాధన , నియమబద్ధమైన జీవితం , ధార్మికమైన ఆలోచనా సరళి పెంచుకుంటూ తపో మార్గాన్ని, ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబించినట్లయితే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసుకోగలము.
ఉదాహరణగా మార్కండేయుడు, సావిత్రి, మొదలైన వారు ఏవిధంగా దైవానుగ్రహాన్ని సంపాదించారో గమనిస్తే సరిపోతుంది .












Click it and Unblock the Notifications