కార్తీకమాసములో చేయవలసినినవి, కూడనివి
వివిధ దానములు ఇక కార్తీక మాసములో పండ్లను - దానము చేసేవాడు దేవర్థి పిత్రూణాలు మూడింటి నుంచి కూడా విముక్తుడై పోతాడు.
దక్షిణాయుతంగా ధాత్రీ (ఉసిరిక) ఫలాన్ని దానమిచ్చువాడు సార్వభౌముడౌతాడు.
కార్తీక పౌర్ణమినాడు లింగదానము సమస్త పాపహారకము. అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి, మరుజన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు. నిషిద్దాహారాలు అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణా సదవకాశము అందరికీ అంత తేలికగా లభ్యము కాదు.

అత్యంతోత్కృష్టమైన ఈ కార్తీక మాసములో ఇతరుల అన్నమును, పితృశేషమును, తినకూడనివి తినడము, శ్రాద్ధములకు భోక్తగా వెళ్లడము, నువ్వుల దానము పట్టడము అనే అయిదూ మానివేయాలి. ఈ నెలలో సంఘాన్నము, శూద్రాన్నము, దేవార్బకాన్నము, అపరిశుద్దాన్నము, త్యక్తకర్ముని అన్నము, విధవా అన్నము - అనేవి తినకూడదు.
కార్తీక పౌర్ణమి, అమావాస్యలలోనూ - పితృదివసము నాడు, ఆదివారమునాడు సూర్యచంద్ర గ్రహణ దినాలలోనూ వ్యతీపాతవైదృత్యాది నిషిద్ధ దినాలలోనూ రాత్రి భోజనము నిషిద్ధము.
ఈ నెలలో వచ్చే ఏకాదశినాడు రాత్రింబవళ్లు రెండు పూటలూ కూడా భోజనము చేయకూడదు.
ఇటు వంటి రోజులలో ఛాయానక్తము (అనగా తమ నీడ - శరీరపు కొలతకు రెండింతలుగా పడినప్పడు భుజించుట) ఉత్తమమని మహర్డులు చెప్పారు.












Click it and Unblock the Notifications