లక్ష్మీ అనుగ్రహం కోసం మనం చేయ వలసినవి ఏమిటి ?
వట్టి ఆలోచన చేస్తే చేయలేరు. ఎలా చేయాలి? ఏ విధంగా మార్కెట్ పెంచాలి. మ్యాన్ పవర్ని పెంచాలి ఇలా ఆలోచించండి. ఖచ్చితంగా సంవత్సరం తిరిగేసరికి మీరు పనిని పదిమందికీ అప్ప ఇచ్చే స్థితికి చేరుకుంటారు.
హైదరాబాద్: వట్టి ఆలోచన చేస్తే చేయలేరు. ఎలా చేయాలి? ఏ విధంగా మార్కెట్ పెంచాలి. మ్యాన్ పవర్ని పెంచాలి ఇలా ఆలోచించండి. ఖచ్చితంగా సంవత్సరం తిరిగేసరికి మీరు పనిని పదిమందికీ అప్ప ఇచ్చే స్థితికి చేరుకుంటారు. ఆ డబ్బు సమస్యలకి భయపడే అజగత్తుడను ముని తన పత్రుణ్ణి అమ్మకున్నాడు. అలా భయపడకుండా ముందుకు సాగండి.
ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు
కొంతమంది భవిష్యత్తులో సంపాదించకపోతామా! అని, ఆ ఆదాయంతో తీర్చేయవచ్చని ధనశక్తికి మించి కొనుగోలు చేస్తారు. కానీ పరిస్థితులు ఎప్పడూ మనం ఊహించినట్టు వుండవు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ పనులే మహాభూతాలుగా మారి ఆర్థికంగా చికాకులనూ, నష్టాలనీ తెప్పిస్తాయి. అలా చేసి బాధపడుతున్నవారు మన చుటూ ఎంతోమంది ఉన్నారు. వారిలా మనం అవ్వకూడదు.
సంకల్పానికి మించిన సంపద లేదు
ఏదైనా సరే ఎంతటి మహాకార్యమైనా సరే మీరు సాధించాలను కుంటే ఆ సంకల్పము బలంగా ఉంటే సాధించగలరు. నిరంతరము దాన్ని గూర్చే ప్రణాళిక, ప్రతి పనీ, ప్రతీ మాటా అదే అని మీరు చేస్తే ఎంతటి కార్యమైనా అయిపోతుంది. పక్కవారు మీ కోరికలని గొంతెమ్మ కోరికలని విమర్శించినా, నవ్వినా, వెనకడుగు వేయొద్దు. సంకల్పాన్ని వీడొద్దు. అలా సంకల్పం చేతనే మహామహులకి సాధ్యం కాని బొందితో స్వర్గాన్ని త్రిశంకుడు పొందాడు.

సంపదను అదుపులో ఉంచినవాడు. అనగా వ్యర్థమైన ఖర్చులను చేయనివాడూ, కీర్తికోసం సంపద వెచ్చించనివాడూ, వ్యసనాలకి ధనాన్ని వెదజల్లనివాడూ, పరులకీ సాటివారికీ కష్టమొచ్చిందంటే ధనాన్ని రెండు చేతులా ఖర్చుపెట్టినవాడూ అట్టివాడు గుణవంతుడు, భగవంతుడు, ధనవంతుడు.
సమస్యలే సంపదలకు అడ్డం
సమస్యలు వందరకాలు. అనేక సమస్యలతో వృత్తిపై ఏకాగ్రత కుదరటం లేదనీ, మనశ్శాంతి లేదనీ... చికాకులనీ.అలాంటి వాటి ద్వారా ధనం సంపాదించలేకపోతున్నామని కొంతమంది అనుకుంటారు. అసలు సమస్యలు ఎవరికి లేవు? మన రాప్తాన్ని ఏలే ముఖ్యమంత్రికీ, దేశప్రధానమంత్రికీ, అమెరికాను ఏలే వైట్ హౌస్ అధిపతికీ సమస్యలు లేవా? ఓసారి ఓ ఇల్లాలు బుద్దుని వద్దకొచ్చి నాకున్న సమస్యలెవ్వరికీ లేవు. అవి తీర్చండీ అని అడిగింది.
దానితో బుధుడు ఆమెని సమస్యలు లేని ఇంటినుంచి గుప్పెడు ఆవాలు తెమ్మని చెప్తాడు. ఆపై సమస్యలన్నీ తీరుస్తానని చెప్పాడు. ఆమె గ్రామమంతా తిరిగింది. సమస్యలా, అసలు నా సమస్యల ముందు నీ సమస్యలెంత?.. అని ప్రతివారూ చెప్పటంతో మళ్లీ బుద్దుడి దగ్గరి కొచ్చి విషయాన్ని చెప్పింది. సమస్యలు మానవులకే కాదు. దేవతలకీ, సమస్త ప్రాణి కోటికీ వున్నాయి. కానీ సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. మన ధర్మాలను మనం చేసుకుంటూ పోతే మహాసుఖాలనిచ్చే సంపదలను పొందవచ్చు.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
జూన్ లో బృహస్పతి దయతో నక్కతోక తొక్కే రాశులు ఇవే! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
మేష రాశి, వృషభ రాశివారి మే నెల జాతక ఫలం -
వాస్తు అంటే ఏమిటి? ఎన్ని రకాలుంటాయి? ఎందుకు అనుసరించాలి? -
మిథున రాశి, కర్కాటక రాశి మే నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం ఇంట్లో చపాతీలను లెక్కపెట్టి చేస్తే పరమ దరిద్రం -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!!












Click it and Unblock the Notifications