రేపే భోగి పండుగ, విశిష్టత ఇదీ: అన్ని పండుగలకు, సంక్రాంతికి తేడా ఇదే
మనము సహజంగా పండగలన్ని చాంద్రమానాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయం చేసుకొవడం జరుగుతాయి. కాని సంక్రాంతి మాత్రం సూర్యున్ని ప్రధానంగా తీసుకుని నిర్ణయం చేయడం జరుగుతుంది. సంక్రాంతి పండగ అనేది మూడు రోజుల పర్వదినం. తిథితో సంబంధం లేని పండగ. ఈ మూడు రోజుల పండగలలో మొదటి రోజు భోగి పండగ. మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చేది భోగి. దక్షిణాయనానికి, ధనుర్మాసానికి చివరి రోజు ఈ రోజు.
14 జనవరి 2019 సోమవారం భోగి పండగ
15 జనవరి 2019 మంగళవారం మకర సంక్రాంతి
16 జనవరి 2019 బుధవారం కనుమ ( పశువులను పూజించే ) పండగ.

మకరరాశి ప్రవేశం ఎప్పుడంటే?
మకర సంక్రమణం శ్రీ విలంబినామ సంవత్సరం పుష్యమాసం శుక్లపక్ష అష్టమి సోమవారం అనగా 14 జనవరి 2019 రోజు అశ్వినీ నక్షత్రం, సిద్ధయోగం, బవకరణం సమయంలో రాత్రి 7:51 నిమిషాలకు జగద్రక్షకుడైన శ్రీ సూర్యభగవానుడు ఉత్తరాషాఢ నక్షత్ర రెండవ పాదంలో మకరరాశి ప్రవేశంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమగును. మకర ప్రవేశం రాత్రి సమయం అయినందున మరుసటిరోజైన 15 జనవరి 2019 మంగళవారం రోజు మకరసంక్రాంతి పర్వదినం సూర్యోదయం నుండే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావున తేదీ 15 మంగళవారం రోజు అందరూ సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలి.

14వ తేదీన భోగి పండుగ
2019 జనవరి 14 తేదీ సోమవారం రోజు పంచాంగ ప్రకారం భోగి పండగ అవుతుంది. భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్ధం. ఎలాగంటే పాడి పంటలు సమృద్ధిగా ఇండ్లకు వచ్చే కాల సమయం. ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానానంతరం ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేసుకొని పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలుకుతూ భోగి మంటలలో పాత పనికిరాని బట్టలను, వస్తువులను వేసి పీడలను,అరిష్టాలను తొలగించుకుంటారు.
తెల్లవారక ముందే భోగి మంటలతో మొదలుకుని కుటుంబంలో ఆనంద కోలాహలం ప్రారంభం అవుతుంది. మనలో ఉన్న బద్దకాన్ని, అశ్రద్ధను, మనసులో ఉన్న చెడు తలంపులను ఈ భోగి మంటలలో వేసి ఈ రోజు నుండి నూతన ఆనంద, ఆప్యాయతలతో కూడుకొని ఉన్నజీవితాన్ని ప్రారంభిస్తున్నామని ఆత్మారామునికి మాట.. ఇచ్చి భవగత్ సన్నిదిలో నిశ్చయ సంకల్పం చేసుకోవడం జరుగుతుంది.

భోగి పండుగ విశిష్టత
ఐదు సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు భోగి పండ్లను పోయడం వలన వారికి ఉన్న బాలారిష్టాలు, ఇతర దోషాలు తొలగి పోతాయి. పిల్లలకు భోగి పండ్లను పోస్తారు. ఈ భోగి పండ్లలో రేగుపండ్లు, జీడిపండ్లు, కొన్ని చిల్లర నాణేములను, బియ్యం పిండితో చేసి నువ్వుల నూనేలో వేయించిన చిన్ని చిన్న వేపగింజల ఆకారంలో తాల్కలు, చెరుకుగడ ముక్కలను ఈ ఐదింటిని ఒకచోట కలిపి ఇంట్లో ఉన్న పిల్లలో ఐదు సంవత్సరాల వయస్సు కలిగిన వారికి కొత్త బట్టలు వేసి కూర్చోవడానికి చాప, దుప్పటి లాంటిది వేసి తూర్పువైపు ముఖం ఉండేలాగ కూర్చో బెట్టి నుదుటన కుంకుమ బొట్టు పెట్టి ఇరుగు పోరుగు పిల్లలను పిలిచి భోగి పండ్లను రెండు చేతులతో పిల్లల తలపై నుండి క్రిందకు జారపడే లాగ పోయాలి. ఆ క్రింద పడిన భోగి పండ్లను పిల్లలు సరదా పడుతూ, పోటీపడుతూ భోగిపళ్లను పోగుచేసుకుని తింటారు.
ఈ సంక్రాంతి భోగి రోజు కొన్ని ప్రాంతలలో ముతైదువలు కొత్త గాజులు వేసుకుంటారు. గాజులు తొడిగిన గాజుల వ్యాపారికి వారి పంట పోలాలలో పండిన కొత్త వడ్లను, ధాన్యములను అనవాయితిగా ఇచ్చి సంతృప్తిగా సాగనంపుతారు. ఇంటికి వచ్చిన కొత్త అళ్ళులు, కూతుర్లతో సరదాగా ఆనందగా ఉంటారు. ఈ రోజును కుటుబంలో ఎంతగానో ఆనంద ఆప్యాయతల మధ్య అనుభూతులు పొందుతారు. పేద గొప్ప అనే తారతమ్యం భేదం లేకుండా కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో ఆనందగా గడుపుతారు.

పిల్లలకు భోగి పళ్ళను పోసే శుభ ఘడియలు:-
ఉదయం 8:40 నుండి 10:19 వరకు
ఉదయం 11:53 నుండి 12:37 వరకు
సాయంత్రం 4:00 నుండి 4:30 వరకు అనుకూల సమయం.
ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు ధనుర్మాసంలో చివరి రోజు ఈ రోజు కావడం చేత దినమంతా దైవ చింతనతో గడుపుతారు. విష్ణుచిత్తుని కుమార్తె ఆండాళ్ ఈ ధనుర్మాసంలోనే కాత్యాయిని వ్రతం చేసి సాక్షాత్తు భగవంతున్ని మెప్పించింది. భవంతున్ని మనస్సు పెట్టి ఎవరైతే ధ్యానిస్తారో వారి పట్ల దేవుడు వారి వారి కోరిన కొర్కేలను తప్పక తీరుస్తాడని మనకు పురాణ, ఇతిహాసాల ద్వార తెలుస్తుంది. జై శ్రీమన్నారాయణ.
డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి, జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications