వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటి ప్రధాన ద్వారం ఏ వైపు ఉంటే అనుకూలం

By Pratap
|
Google Oneindia TeluguNews

శాస్త్ర ప్రకారం ఇంటి కోరకు మీ పేరు (వ్యవహారనామం)లోని మొదటి అక్షరముతో మీరు ఉండే ఇల్లు ప్రధాన ద్వారం ఎంత వరకు మీకు అనుకూలమో చూసుకోండి. మీ గృహానికి సింహద్వారాన్ని ఎంచుకోవాలి అంటే మిమ్మల్ని అందరు ఏ పేరుతో పిలుస్తారో ఆ పేరులోని మొదటి అక్షరాన్ని తీసుకును క్రింద తెలిపిన పట్టిక వర్గులలో మీ పేరుకు ఏ దిశ అనుకూలంమో చూసుకుని గృహ నిర్మాణం కాని,అద్దెకు ఉండడానికైన సరే మీ ఇంటి యజమాని పేరు మొదటి అక్షరం సహాయంతో నిర్ణయం తీసుకోవాలి.

జాతక జన్మనక్షత్ర ఆధారంగా వచ్చిన జన్మనామము ఇంటి సింహాద్వారా నిర్ణయానికి పనికిరాదు. గృహానికి దిశను సరిగ్గా గుర్తించే కంపాస్ సహాయంతో దిక్కులను గుర్తించి సరిపోయే గృహ ప్రధాన ద్వారాన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.మీరు ఉండేది స్వంత ఇల్లా ,కిరాయి ఇల్లు అయిన సింహా ద్వార నిర్ణయంలో పద్ధతి ఒకటే. వాటి ఫలితాలు ఒక్కటే కావున మీకు సరిపడ సింహద్వారాన్ని ఎంచుకుని హయిగా జీవించండి.

Which side the main door should be kept?

అ నుండి అం,ఆ: వరకు (ఆ-వర్గు) తూర్పు, పడమర, దక్షిణం దిశ ద్వారములు అనుకూలం.(సరిపడని దిశ ఉత్తర సింహద్వారం.)

క ,ఖ,గ,ఘ,ఙ (క -వర్గు)దక్షిణం,పడమర దిశ సరిపోయే సింహద్వారము. (సరిపడనివి దిశలు తూర్పు, ఉత్తరం.)

చ,ఛ,జ,ఝ,ఇ+(ఛ-వర్గు)తూర్పు, ఉత్తరం, పడమర దిశ సరిపోయే సింహద్వారాలు. (సరిపడని దిశ సింహద్వారం దక్షిణము)

ట,ఠ,డ,ఢ,ణ (ట-వర్గు) తూర్పు, ఉత్తరం, పడమర దిశ సరిపోయే సింహద్వారాలు. (సరిపడని దిశ సింహద్వారము దక్షిణము)

త,ద,ధ,న (త-వర్గు)తూర్పు, ఉత్తరం దిశ సరిపోయే సింహద్వారములు.(సరిపడని దిశ సింహద్వారము దక్షిణ, పడమర)

ప,ఫ,బ,భ,మ (ప-వర్గు) తూర్పు, ఉత్తరము దిశ సరిపోయే సింహద్వారములు (సరిపడని దిశ సింహద్వారము దక్షిణం,పడమర)

య,ర,ల,వ (య-వర్గు) తూర్పు, పడమర, దక్షిణం దిశ సరిపోయే సింహద్వారములు. (సరిపడని దిశ సింహా ద్వారం ఉత్తరం)

శ.ష,స,హ (శ-వర్గు) దక్షిణం,తూర్పు దిశ సరిపడే సింహద్వాములు. (సరిపడని దిశ సింహ ద్వారము ఉత్తర మరియు పడమర)

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

English summary
Astrologer explined the on which side the main doorto be kept to the house according to the Vasthu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X