అక్టోబరు నెలలో ఏ రాశులవారు కారు కొనుగోలు చేయబోతున్నారు?
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని అద్భుత యోగాలను ఏర్పరుస్తుంటాయి. వీటివల్ల కొన్ని రాశులకు సానుకూల ఫలితాలు, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి. అక్టోబరు నెలకు సంబంధించి కొన్ని రాశులకు అద్భుతంగా ఉంది. గ్రహాల సంచారం మరియు జ్యోతిష్య నిపుణుల అంచనాల ప్రకారం, అక్టోబరు నెలలో ప్రధాన గ్రహాల రాశి మార్పుల కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం బాగా కలిసివస్తుంది, ఆర్థికంగా బలపడటంతోపాటు అన్ని రంగాలలో విజయాలు సాధిస్తారు. ఈ నెలలో కారు కొనుగోలు చేయబోయే రాశుల గురించి తెలుసుకుందాం. గురు, శుక్ర, బుధ గ్రహాల సంచారం ఆధారంగా కొన్ని రాశుల వారికి గృహ, వాహన యోగాలు బలంగా ఉన్నాయి.
మేష రాశి
గురుడు, బుధుడు, శుక్రుని ప్రత్యేక అనుకూలత వల్ల ఈ రాశివారికి ఆర్థిక బలంతో పాటు ఆకస్మిక ధనలాభం, నూతన వాహనం సమకూర్చుకునే అవకాశం ఉంది.
మిథున రాశి
గ్రహాల అనుకూల స్థానం కారణంగా వీరికి ఆర్థిక సమస్యలు తొలిగిపోయి, ఆదాయం వృద్ధి చెందడంతో పాటు కోరుకున్న వాహనాన్ని కొనుగోలు చేసే యోగం పడుతుంది.

కర్కాటక రాశి
గృహ, వాహన కారకుడైన గురు గ్రహం ఈ రాశిలో అనుకూలంగా సంచరించడం వల్ల, వాహనాలు లేదా ఆస్తుల కొనుగోలుపై దృష్టి పెట్టడానికి, అనుకూల ఫలితాలు పొందడానికి ఇది మంచి సమయం.
కన్యా రాశి
బుధ, గురుల ప్రభావం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగై, కొత్త వాహనం కొనుగోలు చేయాలనే దీర్ఘకాలిక కోరిక నెరవేరే అవకాశం ఉంది.
తుల రాశి
దశమ స్థానంలో గురు సంచారం వల్ల వ్యాపారం, ఉద్యోగాల్లో అదనపు ఆదాయం పెరుగుతుంది. దీనివల్ల సొంతంగా వాహనాలు లేదా ఆస్తులు సమకూర్చుకోవడానికి మార్గం సుగమం అవుతుంది.
మకర రాశి
శుక్ర గ్రహ బలంతో పాటు గ్రహాల అనుకూలత కారణంగా ఈ ఏడాది, ముఖ్యంగా ఈ కాలంలో వాహన కొనుగోలుకు బలమైన యోగాలు ఉన్నాయి. అక్టోబర్ నెలలో వచ్చే విజయదశమి వంటి పర్వదినాలు కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి అత్యంత శుభప్రదమైన రోజులుగా పరిగణిస్తారు.














Click it and Unblock the Notifications
