తెల్లని అన్నంతో ఏయే పూజలు చేయొచ్చు..? పండితులు ఏం చెప్తున్నారు ..!!

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151

1.తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో ఎవరైతే వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదు ఇబ్బందులు కలుగవు. త్వరలోనే ఆర్థిక స‌మ‌స్య‌లు తీరిపోతాయి.

2.తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా పెట్టిన వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి.

Whoever lifts the Shivalinga with white rice and worships

3. తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి.

4. తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ, అభిమానాలను కలిగి ఉంటారు. చాలా వరకు శాంతి లభిస్తుంది.మనస్సులో ఉండే భయం,భీతి, బెదిరింపులన్నీ తొలగిపోతాయి.

5. తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైశ్చరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులను పెడితే మీకు
ఉన్న పితృ దేవతల శాపాలన్నీ తొలగిపోతాయి.

6. అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి,అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది.

7. సరిగా అన్నం తినని వారికి తెల్ల అన్నం పసుపు, కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి
ప్రవహించే నీటిలో కానీ ఏదైనా చెట్టు మొదలులో కానీ వేసిన ఎడల ఎటువంటి దిష్టి అయినా తొలగిపోతుంది.

సాధారణ సమస్యలు అయితే పై పరిహారాల వలన ఉపశమనం కలుగుతుంది.సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు జాతక చక్రాన్ని పరిశీలించి తగిన పరిహారం చేసుకున్న ఎడల పూర్తి ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+