గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు?
భక్తులు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. అలా ఎందుకు చేస్తారనే విషయం చాలా మందికి తెలియదు. అది ఎందుకో జ్యోతిష్కుడు వివరించారు.
ప్రదక్షిణం లో ప్ర' అనే అక్షరము పాపాలకి నాశనము.'ద అనగా కోరికలు తీర్చమని, క్షి అన్న అక్షరము మరుజన్మలో మంచి ఇవ్వమని.'ణ అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని. గుడిలో భగవంతుడి చుటూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది.
పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ, పరమేశ్వరుల చుటూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కావున భగవంతుని చుటూ ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణమవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా! నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం.

రాహుకేతువులకి అప్రదక్షిణము చేయాలా?
గ్రహాలకి రాజు సూర్యుడు అన్నీ గ్రహాల మధ్యన ఉంటాడు. చంద్రుడు ఆగ్నేయంగా ఉంటాడు. అంగారకుడు దక్షిణంగానూ, బుధుడు సూర్యునకు ఈశాన్యంగానూ, బృహస్పతి ఉత్తర దిక్కుగానూ ఉన్నారు. తూర్పున శుక్రడ ఉంటాడు. పశ్చిమ దిక్కున్న శనైశ్చరుడూ, నైఋతిలో రాహువూ, వాయువ్యంలో కేతువూ ఉంటారు. అయితే గ్రహాలన్నీ ఒకే విధంగా ఉంటే రాహుకేతువులు వేరుగా అప్రదక్షిణంగా తిరుగుతున్నట్లు ఉంటాయి. అయినా మనం ఆయా గ్రహాల పూజల ప్రకారమే చేయాలి.












Click it and Unblock the Notifications