'శ్రీరామ' అనే పదం ఎందుకు శక్తివంతమైందో తెలుసా?
'శ్రీరామ'.. 'శ్రీరామ'.. అనే ఈ మూడక్షరాల పదమే విశ్వంలో అత్యంత శక్తివంతమైనది.. అత్యంత శుభకరమైంది. మహా మంత్రాలు ఏడు కోట్లు ఉంటే అందులో రామ అనే రెండుక్షరాలే అత్యంత శ్రేష్టమైనవి. నువ్వు దేవాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు.. భగవంతుడి కోసం పూజలు చేయాల్సిన అవసరం అంతకన్నా అవసరంలేదు. కేవలం భగవంతుడి నామాన్ని పలికితే చాలు.. ఎంతో పుణ్యం. జన్మజన్మల పాపాలు హరించుకుపోతాయి. అసలు ఈ పదం ఎందుకు? ఎలా? శక్తివంతమైందో, ఆ పేరు ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.
శ్రీరామ అనే పదం మనం పలకడం వల్ల శ్రీరాముడు ఒక్కడే పలుకుతాడు అనుకుంటే అది పొరపాటు. అత్యంత మహత్తరమైన ఆ పదాన్ని జపిస్తే ఆరుగురు దేవుళ్లు పలుకుతారు. రామా అంటూ నువ్వు ఆర్తిగా పిలిస్తే రాముడు పలుకుతాడు.. శ్రీ అంటే లక్ష్మీదేవి పలుకుతుంది.. తర్వాత రాముడి పదం ఎక్కువగా ఎవరు జపిస్తుంటారో అక్కడ అందరికన్నా ఎక్కువగా ఆనందించేంది ఆంజనేయుడే. రా అంటే విష్ణువు అని అర్థం ఓం నమో నారాయణ అనే పేరు నుంచి రా అనే అక్షరాన్ని తీసుకున్నారు.

మా అంటే శివుడు. ఓం నమ:శ్శివాయ అనే నామం నుంచి మ అనే జీవాక్షరాన్ని తీసుకున్నారు. శివుడు హనుమంతుడి రూపంలో భూలోకానికి రాముడి సేవకు బయలుదేరిన సమయంలో పార్వతీదేవి వచ్చి తనకు కూడా అటువంటి అదృష్టాన్ని ప్రసాదించమని కోరింది.

దీంతో ఆంజనేయుడి తోక రూపంలో పార్వతీదేవి వస్తుంది. హనుమంతుడు వస్తే పార్వతీదేవి కూడా వచ్చినట్లే. ఇలా ఒక పేరు పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు. మనదేశంలో వేల సంఖ్యలో గ్రామాలకు రాముడి పేర్లే ఉంటాయి. మనుషులకైతే వీధికి ఇద్దరు చొప్పున ఉంటారు. రాముడి రక్షణ ఉంటే ప్రశాంతంగా జీవించవచ్చనే విశ్వాసం ఉంది.












Click it and Unblock the Notifications