బాధకు ప్రతిరూపం శని గ్రహమా?
చాలా కాలం నుండి ఏవైనా సమస్యగా మారిన వ్యక్తి కనిపిస్తే శనిగాడిలా దాపురించాడని, తాను దురదృష్టవంతులమని భావించే వారు నెత్తిమీద శని తాండవం చేస్తున్నాడని నిరాశా నిసృహలతో అంటుండడం అందరు వింటూనే ఉంటారు.
అంతవరకు సాఫీగా సాగుతున్న జీవితంలో అనుకోకుండా ఇబ్బందులు ఎదురవ్వడం, అంతవరకు మిత్రులుగా ఉన్నవారు దూరమవ్వడం, ఉద్యోగంలో ఇబ్బందులు, అధికారులతో మాటపడడం, వివాహములో ఎదురౌడం, కుటంబములో సమస్యలు, అనారోగ్యములు, అప్పల బాధలు వగైరా వగైరా సంఘటనలు ప్రతివారి జీవితంలో ఎదురౌతుంటాయి.
వీటికి కారణాలు ఏమిటి?
ఇటువంటప్పడు గుర్తుకువచ్చేది జ్యోతిష్యము లేదా జాతకము. తెలుసున్నఏ జ్యోతిష్యుని వద్ద జాతక పరిశీలన చేయించినపుడు ఏ దోషాలున్నది తెలుసుకుని దానికి అనుగుణంగా శాంతులు దానాలు చేసుకుంటారు.
ఈ సందర్భంలో తరచు వినేవి మీకు ఏలినాటి శని దశ అర్గాష్టమ శని దోషం, అష్టమ శని దోషం,శని దశ బాగోలేదు అనే మాటలు వింటుం టాము. అలాగే చాలా కాలం నుండి ఏవైనా సమస్యగా మారిన వ్యక్తి కనిపిస్తే శనిగాడిలా దాపురించాడని, తాను దురదృష్టవంతులమని భావించే వారు నెత్తిమీద శని తాండవం చేస్తున్నాడని నిరాశా నిసృహలతో అంటుండడం అందరు వింటూనే ఉంటారు.
నిజంగా శని అంత ఇబ్బంది కలిగిస్తాడా? ఆ గ్రహనైజమే అదా?
ప్రతీవారు శని బారిన పడవలసిందేనా? దోషనివారణకు శాంతులు చేసుకుంటే సరిపోతుందా? ఎవరికి ఎప్పడు శని దోషాలు ఏర్పడతాయి.
ఇటువంటి సందేహాలకు సమాధానము పరిశీలిద్దాం.
గ్రహతత్త్వములు జ్యోతిశాస్త్రంలో ఒక విచిత్రం కనిపిస్తుంది. నవగ్రహాలలో ప్రధానుడుగా సౌరమండలాధిపతిగా, గ్రహరాజుగా చెప్పబడిన సూర్యుని క్రూర గ్రహంగాను వ్యసనములు, భోగలాలసత, కాముకత్వమును సూచించే శుక్రుడు శుభగ్రహం గాను పరిగణించడం జరిగింది. దీనికి కారణం ఏమిటి? అని ఒకాయన ప్రశ్నిస్తే మా గురువుగారు చక్కని ఉదాహరణతో దీనికి గల కారణము తెలియ చేసారు.

సూర్యుడు జ్ఞానకారకుడు, పునర్జన్మ లేకుండా కోరుకునేవారికి మార్గమై ఉండేవాడు,అత్మవేత్తలైన యోగీశ్వరులకు సచ్చిదానందరూపుడు, మానవుల యొక్క నాశోత్పత్తిస్థితులకు కారణమైనవాడు సూర్యుడు. (ఈ కారణం చేతనే హనుమంతుడు సూర్యునిని గురువుగా చేసుకున్నాడు)
లౌకిక ప్రపంచంలో సదా కోరికలతో మునిగి తేలుతువుండే సాధరణ మానవులకు పారలొకిక జ్ఞానము,పునర్జన్మ లేకుండా ఉండడం సచ్చిదానంద స్వరూపం ఇలాంటివి మన చెవులకు ఎక్కుతాయా? ఉదాహరణకు మనకు జ్ఞానోదయం చేసూ సరియైన పద్ధతిలో నడిపించడానికి దండించే గురువుపై తాత్కాలికంగా కోపం ఉండడంతో గురువు క్రూరుడుగా కనిపిస్తాడు.
సంతానాన్ని సరియైన మార్గంలో పెట్టడానికి శిక్షించే తండ్రి క్రూరుడుగానే కనిపిస్తాడు దొంగలకు పోలిసు చెడ్డవాడైనట్లు, ఇది రవియొక్క స్థితి. ఇక శుక్రుని స్వభావమైన స్వార్థము, స్వప్రయోజనములు, వ్యసనములు, భోగలాలసత ఇలాటి లౌకికమైన కోరికలను కోరుకునే మానవులకు సూర్యుడు క్రూరుడు అవుతాడు.
ఇటువంటి వాటిపై దృష్టి మళ్లకుండా చేసూ మన భౌతికమైన కోరికలు తీర్చే శుక్రుడు శుభుడవ్వడంలో సందేహం లేదు. ఇటువంటి స్థితే మరికొన్ని గ్రహముల విషయంలోను ఏర్పడుతుంది. ఈ కోవలో దొంగలకు చెడ్డవాడిగా కనిపించే పోలీసు,సరియైన మార్గ దర్శకం చేయడానికి దండించే గురువు,సంతానాన్ని సక్రమ మార్గంలో పెట్టే తండ్రి పాత్రలలో ఇమిడే గ్రహము మనము చర్చించుకునే గ్రహము.












Click it and Unblock the Notifications