బృహస్పతి రాశి మార్పుతో ఈ రాశుల దశ, దిశ మారిపోతోంది!
బృహస్పతి దేవతల గురువు. ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేసే సమయంలో చాలా వేగంగా సంచారం చేస్తాడు. గురువు జ్ఞానానికి కారకుడు. ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రసాదిస్తాడు. మన జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు తోడ్పడతాడు. అంతేకాదు.. వివాహాన్ని, పిల్లలను కూడా ప్రసాదిస్తాడు. గురువు అక్టోబరులో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల అనేక శుభ పరిణామాలు, అనేక శుభ యోగాలు కలుగుతాయి. ఈ రాశికి చంద్రుడు అధిపతి. ఈ పరిణామాలతో ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
గురువు సంచారం వీరికి అదృష్టాన్ని మోసుకొస్తుంది. వివాహం కానివారికి వివాహం కుదురుతుంది. పిల్లలు లేనివారికి సంతానం కలుగుతుంది. వ్యాపారస్తులకు బాగుంటుంది. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించి ఆర్థికంగా మంచి లాభాన్ని పొందుతారు. ఆర్థికంగా గతంలోకంటే ఇప్పుడు పరిస్థితి మెరుగుపడుతుంది. ఇబ్బందులన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు గురువును పూజించాలి.

తులా రాశి
వ్యాపారస్తులకు కలిసిరావడానికి ఇది మంచి సమయం. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ సమయంలో మంచి లాభాలను అందుకుంటారు. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించడంతోపాటు కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఉద్యోగస్థులకు అనేక రకాల మార్గాలద్వారా డబ్బులు వస్తాయి. పనితీరుపై మంచి పేరు తెచ్చుకుంటారు. వీరికి పదోన్నతి ఉంది.
కర్కాటక రాశి
ఈ రాశివారు కొత్త అవకాశాలను పొందుతారు. దీనివల్ల వారికి మంచి లాభాలు ఒనగూరుతాయి. వివాహం కానివారికి వివాహం కుదురుతుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఉద్యోగం వస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. దాంపత్య జీవితంలో ఉన్న కలతలన్నీ గురువు దయవల్ల తొలగిపోయి భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు.












Click it and Unblock the Notifications